17 April, 2026 | 6:29 PM

నెలాఖరులో పోలీస్ యాక్ట్ 1861 అమలు

03-05-2025 12:06 AM

మహబూబ్ నగర్ మే 2 (విజయ క్రాంతి) : జిల్లాలో శాంతి భద్రతల దృష్ట్యా, ప్రశాంతత ను పెంపొందించేందుకు  ఈనెల రెండవ తేదీ నుంచి 31వ తేదీ వరకుbజిల్లా అంతటా 30 పోలీస్ ఆక్ట్ 1861 అమలులో ఉంటుందని జిల్లా ఎస్పీ డి.జానకి ఒక ప్రకటనలో తెలిపారు.

పోలీస్‌ఆక్ట్ 1861 అమలు లో ఉన్నందున జిల్లాలో సబ్ డివిజనల్ పోలీస్ అధికారి, పోలీస్ ఉన్నత అధికారుల నుంచి అనుమతి లేకుండా ఎటువంటి పబ్లిక్ మీటింగులు, ఊరేగింపులు, ధర్నాలు చేయకూడదని,  నిషేదిత ఆయుధములు అయిన కత్తులు, చాకులు, కర్రలు, జెండా కర్రలు, దుడ్డుకర్రలు, తుపాకులు ప్రేలుడు పదార్థములు, నేరమునకు  ఎటువంటి ఆయుధ ములను ఉపయోగించకూడదన్నారు. 

ప్రజలకు ఇబ్బంది, చిరాకు కలిగించేందుకు దారి తీసే పబ్లిక్ మీటింగ్ లను, జనసమూహం ప్రోగు అవుట వంటివి నిషేధం. రాళ్ళను జమ చేయుట,  ధరించి సంచరించుట వం టివి నిషేధం. లౌడ్ స్పీకర్‌లు, డీజే లు వం టివి కూడా ఈ సమయంలో నిషేధం చేశారని పేర్కొన్నారు. నియమాలు ఎవరైనా ఉల్లంఘించిన  30 పోలీస్ ఆక్ట్ 1861 కింద శిక్షార్హులు అగుదురని ఎస్పి  పేర్కొన్నారు.