03-05-2025 12:04:07 AM
ప్రధాని మోదీ చిత్ర పటానికి ఎంపీ, ఎమ్మెల్యే పాలాభిషేకం
ఆదిలాబాద్, మే 2 (విజయక్రాంతి): దేశ భవిష్యత్తు దృష్ట ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజల జనగణన, కులగణన చేయాలని నిర్ణయించారని ఎంపీ గోడం నగేష్ అన్నారు.
కేంద్ర ప్రభుత్వం జనగణన, కుల గణన చేపట్టేందుకు ప్రకటించడంతో ఆదిలాబాద్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శుక్రవా రం మోదీ చిత్ర పటానికి ఎమ్మెల్యే పాయల్ శంకర్‌తో కలిసి పాలాభిషేకం చేసి తమ అభిమానాన్ని చాటుకున్నారు.
ఈ మేరకు ఎంపీ గోడం నగేష్ మాట్లాడుతూ.. కేంద్రం కులగణనకు ఒప్పుకోవడం తమ విజయమని కాంగ్రెస్ పేర్కొనడం విడ్డూరంగా ఉందన్నారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఓ ఫెయిల్యూర్ నాయకుడని అభివర్ణించారు. దేశంలో అన్ని రాష్ట్రాలకు ఈ కులగణన అనే ది ఉపయోగపడే విధంగా ప్రతి వర్గానికి, అన్ని పథకాలు అందే విధంగా ఉపయోగపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు బ్రహ్మానం దం, నాయకులు వేదవ్యాస్, జోగు రవి, భూమేష్, రాకేష్, సుభాష్, దయాకర్ పాల్గొన్నారు.