calender_icon.png 3 May, 2025 | 1:57 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సాహసోపేత నిర్ణయాలు బీజేపీకే సాధ్యం

03-05-2025 12:06:14 AM

  1. జనగణనతోపాటు కులగణనపై  కేంద్ర నిర్ణయం చరిత్రాత్మకం
  2. పలుచోట్ల ప్రధాని మోదీ చిత్రపటానికి క్షీరాభిషేకం
  3. బీజేపీ మాజీ జిల్లా ప్రధాన కార్యదర్శి రోడ్డ మోహన్ 

మందమర్రి, మే 2: దేశవ్యాప్తంగా జనగణనతోపాటు కులగణనకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలపడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ బీజేపీ ఆధ్వర్యంలో ప్రధాని నరేంద్ర మోదీ చిత్రపటానికి క్షీరాభిషేకం నిర్వహించారు. పట్టణంలోని పాత బస్టాండ్ ఏరియా లో శుక్రవారం నిర్వహించిన కార్యక్రమంలో ప్రధానికి నరేంద్ర మోదీకి క్షీరాభిషేకం నిర్వహించారు.

ఈ సందర్భంగా బీజేపీ మాజీ జిల్లా ప్రధాన కార్యదర్శి రోడ్డ మోహన్ మాట్లాడుతూ 60 సంవత్సరాలు భారత దేశాన్ని పాలించిన కాంగ్రెస్ ప్రభుత్వం ఏ రోజున కులగణన చేపట్టకపోవడం  సిగ్గుచేటని విమర్శించారు. 1952లో అప్పటి ప్రభు త్వం కులగణన  చేపట్టిన తర్వాత దళిత, గిరిజన, అల్పసంఖ్యా కుల గణన చేపట్టి దళి తులను షెడ్యూల్ క్యాస్ట్‌గా గిరిజనులను షెడ్యూల్ తెగలుగా ప్రకటించి రాజ్యాంగంలో వారికి అనేక హక్కులను కల్పించిన టువంటి విషయాన్ని ఆయన గుర్తు చేశారు.

ప్రస్తుత పరిస్థితుల్లో బీసీలలో అత్యంత అల్పసంఖ్యాక వర్గాలు ప్రభుత్వ ఫలాలకు నోచు కోకుండా జీవిస్తున్నారని కులగణన ధ్వారానే వారికి  న్యా యం జరుగుతుందని ఆయన స్పష్టం చేశా రు. దేశ స్వాతంత్రం అనంతరం తీసుకున్న అనేక సాసోపేతమైన నిర్ణయాలన్ని కూడా భారతీయ జనతా పార్టీ మాత్ర మే చేయగలిగిం దని సాహసోపేతమైన నిర్ణయాలన్నీ బీజేపీ తోనే సాధ్యమని ఆయన స్పష్టం చేశారు.

తెలంగాణలో చేపట్టిన కుల గణన కార్యక్రమాన్ని చూసి మోదీ  దేశంలో కులగణనకు పిలుపునిచ్చారని కాంగ్రెస్ ప్రచారం చేయడం హాస్యస్పదమని ఆయన తీవ్రంగా విరుచుకుపడ్డారు. ఈ కార్యక్రమం లో  సీనియర్ నాయకులు డివి దీక్షితులు, రాంటెంకి దుర్గరాజు, విహెచ్పిఎస్ నాయకులు పెద్దపల్లి సత్యనారాయణ, పట్టణ నాయకులు శివ,  ప్రసాద్ పాల్గొన్నారు.

మోదీ చిత్ర పటానికి క్షీరాభిషేకం

మంచిర్యాల, మే 2 (విజయక్రాంతి): కేం ద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా కులగణన చేప ట్టాలని తీసుకున్న చారిత్రాత్మక నిర్ణయాన్ని హర్షిస్తూ  భారతీయ జనతా పార్టీ మంచి ర్యాల పట్టణ శాఖ ఆధ్వర్యంలో శుక్ర వారం దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చిత్ర పటానికి క్షీరాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ పట్టణ అధ్యక్షులు అమిరి శెట్టి రాజు కుమార్, బీసీ మోర్చా జిల్లా అధ్యక్షులు బొడ్డున మల్లేష్, మంచి ర్యాల మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ గాజుల ముకేష్ గౌడ్ మాట్లాడుతూ.. దేశవ్యాప్త కులగణనపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కేబినెట్ తీసుకున్న నిర్ణయం చరిత్రాత్మక మన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి పల్లి రాకేష్, మంచి ర్యాల అసెంబ్లీ కన్వీనర్ తోట మల్లిఖార్జున్, బీజేపీ పట్టణ ప్రధాన కార్యదర్శిలు బోయిని హరికృష్ణ, రెడ్డి మల్ల అశోక్, ఎస్సీ మోర్చా పట్టణ అధ్యక్షులు దేవరకొండ వెంకన్న, ఎస్సి మోర్చా జిల్లా కార్యదర్శి నాగుల రాజన్న, బెల్లంకొండ మురళీ, పూదరి రాంచందర్, బీ జేవైఎం పట్టణ ప్రధాన కార్యదర్శి చిరంజీవి, మేరెడీ కొండ శ్రీనివాస్, తరుణ్ సింగ్, రవీందర్ యాదవ్, పవన్ కుమార్, అనిల్ కుమార్ బీజేపీ కార్యకర్తలు పాల్గొన్నారు.