calender_icon.png 31 January, 2026 | 5:36 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రేపటి నుంచే పోలీస్ యాక్ట్ అమలు

31-01-2026 04:17:44 PM

జిల్లా ఎస్పీ శ్రీనివాస్ రావు 

మెదక్,(విజయక్రాంతి): మెదక్ జిల్లా శాంతి భద్రతల పరిరక్షణ దృష్ట్యా ఫిబ్రవరి 01 నుండి 28 వ తేదీ వరకు జిల్లా వ్యాప్తంగా 30, 30(ఎ) పోలీసు యాక్ట్ – 1861 అమలులో ఉంటుందని జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాస రావు తెలిపారు. ఈ సమయంలో పోలీసు అధికారుల ముందస్తు అనుమతి లేకుండా ఏవిధమైన ధర్నాలు, రాస్తారోకోలు, నిరసనలు, ర్యాలీలు, పబ్లిక్ మీటింగ్స్, సభలు, సమావేశాలు నిర్వహించడం నిషేధమని తెలిపారు.

అలాగే ప్రజల/ప్రభుత్వ ఆస్తులకు నష్టం కలిగించే చట్టవ్యతిరేక చర్యలు, అశాంతి సృష్టించే ప్రయత్నాలు ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని స్పష్టం చేశారు. శాంతి భద్రతల నిర్వహణలో ఎవరైనా విఘాతం కలిగిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జిల్లా ప్రజలు, ప్రజా ప్రతినిధులు, వివిధ సంఘాల నాయకులు ఈ విషయంలో పోలీసులు చేపడుతున్న చర్యలకు సహకరించాలని జిల్లా ఎస్పీ విజ్ఞప్తి చేశారు.