calender_icon.png 31 January, 2026 | 6:50 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సుల్తానాబాద్ వేదికగా సీఎం కప్ క్రీడా పోటీలు

31-01-2026 05:08:58 PM

సుల్తానాబాద్,(విజయక్రాంతి): తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న సీఎం కప్ క్రీడా పోటీలు ఫిబ్రవరి 2,3 తేదీలలో సుల్తానాబాద్ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో మున్సిపాలిటీ, మండల స్థాయిలో నిర్వహించనున్నట్లు ఎంఈఓ రాజయ్య శనివారం తెలిపారు. వాలీబాల్, కబడ్డీ, ఖోఖో, అథ్లెటిక్స్ విభాగాల్లో పోటీలు జరుగుతాయని, 2న బాలికలకు, 3న బాలురకు నిర్వహిస్తామని చెప్పారు. క్రీడాకారులు ఆధార్ కార్డు, ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ కాపీతో హాజరుకావాలని సూచించారు.వివరాల కోసం ఎస్‌జీఎఫ్ కార్యదర్శి తాండ్ర ప్రణయ్ (09618336976), పీడీలు వెంకటేష్ (09959779827), శ్రీవాణి, సత్యనారాయణ 9396540067 లను సంప్రదించాలని కోరారు.