calender_icon.png 31 January, 2026 | 6:51 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భార్య కాపురానికి రావడం లేదని గొంతు కోసుకున్న భర్త

31-01-2026 05:03:41 PM

ఉట్నూర్,(విజయక్రాంతి): అగ్నిసాక్షిగా పెళ్లి చేసుకున్న భార్య పుట్టింటికి వెళ్లి కాపురానికి రావడంలేదని భర్త గొంతు కోసుకొని ఆత్మహత్యయత్నం చేసిన ఘటన ఇంద్రవెల్లి మండలంలో చోటు చేసుకుంది. ఏమాయకుంట పంచాయతీ పరిధిలోని సుందర్ నగర్ లో నివాసం ఉండే రాందాస్ (40) శనివారం గొంతు కోసుకొని ఆత్మహత్యకు ప్రయత్నించాడు. గొంతు కోసుకున్న సమయంలో ఇంటి చుట్టుపక్కల ఉన్నవారు ఆత్మహత్యయత్నాన్ని అడ్డుకుని,  108 అంబులెస్ కు సమాచారం అందించారు. వెంటనే 108 ఈఎంటీ కృష్ణ, పైలెట్ రాజేష్ వెళ్లి ప్రథమ చికిత్స అందించారు. వెంటనే జిల్లా కేంద్రంలోని రిమ్స్ తరలించారు. ఈ సంఘటనపై ఫిర్యాదు రాలేదని, ఫిర్యాదు రాగానే కేసు నమోదు చేస్తామని ఎస్సై సాయన్న తెలిపారు.