calender_icon.png 31 January, 2026 | 8:49 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సంసద్ ఖేల్ మహోత్సవం సందర్భంగా క్రికెట్ విజేతలకు బహుమతులు

31-01-2026 05:11:55 PM

సనత్‌నగర్,(విజయక్రాంతి): ప్రధాన మంత్రి సంసద్ ఖేల్ మహోత్సవం 2025–26 సందర్భంగా అమీర్‌పేట GHMC గ్రౌండ్స్‌లో నిర్వహించిన క్రికెట్ పోటీల విజేతలకు బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా పాల్గొన్న బూరుగుల అవినాష్ గౌడ్ విజేతలకు ట్రోఫీలు, బహుమతులు ప్రదానం చేసి క్రీడాకారులను అభినందించారు. క్రీడలు శారీరక దృఢత్వంతో పాటు క్రమశిక్షణ, స్నేహభావాన్ని పెంపొందిస్తాయని ఆయన పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో బూరుగుల రాకేష్ గౌడ్, శ్రీశైలం గౌడ్, అమీర్‌పేట డివిజన్ అధ్యక్షుడు పవన్ కుమార్, దశరథ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.