calender_icon.png 31 January, 2026 | 6:30 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రజా ప్రభుత్వానికి జీవితాంతం రుణపడి ఉంటాం

31-01-2026 04:52:10 PM

ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు

హనుమకొండ టౌన్,(విజయక్రాంతి): వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి ఆదేశాల మేరకు హనుమకొండ 60వ డివిజన్ వడ్డేపల్లిలో శనివారం మాజీ కార్పొరేటర్ ఏనుకొంటి నాగరాజు, డివిజన్ అధ్యక్షులు ఎనుకొంటి పున్నంచందర్ ల ఆధ్వర్యంలో ఇందిరమ్మ ఇల్లు పూర్తి చేసుకున్న లబ్ధిదారులు బొల్లెపల్లి స్వరూప నరేందర్ లకి అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం లబ్ధిదారులు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వంలో గూడులేని నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేసి, దశలవారీగా రూ.5 లక్షలు లబ్ధిదారుల ఖాతాల్లో వెయ్యడం వల్లనే  మేము సొంత ఇంటికల నెరవేర్చుకున్నాం.

అందుకు రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి లకి జీవితాంతం రుణపడి ఉంటామని కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో డివిజన్ మహిళా అధ్యక్షురాలు గన్నేబోయిన శ్వేత, కాంగ్రెస్ శ్రేణులు జనగాం శ్రీనివాస్ గౌడ్, బుస్సా నవీన్ కుమార్, ఎం.డి సాజిద్, మట్టపల్లి కమల్ కుమార్, శ్రీరాముల స్వప్న, అధికారులు ఏ ఈ నరేందర్ రాజు, వార్డ్ ఆఫీసర్ హరినాథ్, బిల్ కలెక్టర్ అజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.