31-01-2026 05:14:22 PM
బేల,(విజయక్రాంతి): విశ్వ సృష్టికర్త భగవాన్ విశ్వకర్మ జయంతి వేడుకలను బేల మండల కేంద్రంలో మరాఠీ వడ్రంగి కులస్తుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. శనివారం సంఘ భవనం వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వివిధ పార్టీల నేతలు హాజరై విశ్వకర్మ చిత్రపటానికి పూజలు నిర్వహించారు. ప్రపంచ నిర్మాణంలో విశ్వకర్మ పాత్ర ఎనలేనిదనీ వక్తలు పేర్కొన్నారు. కులస్తులంత ఐక్యంగా ఉంటేనే తమ హక్కులను సాధించుకోవచ్చని సూచించారు.
ఈ కార్యక్రమంలో బేల సర్పంచ్ భాగ్యలక్మి, ఎస్.ఐ ప్రవీణ్, సర్పంచ్ ల సంఘ మండల అధ్యక్షులు అశోక్ టాక్రె, మాజీ సర్పంచ్లు మస్కె తేజ రావు, దేవన్న, మార్కెట్ కమిటీ ఉపాధ్యక్షుడు విలాస్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు సంజయ్ గుండవార్, మాజీ జెడ్పిటిసి రాందాస్ నాక్లే, సుధాం రెడ్డి, యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ ఉపాధ్యక్షులు సామ రూపేష్ రెడ్డి, బీఆర్ఎస్ మండల అద్యక్షుడు ప్రమోద్ రెడ్డి, నాయకులు గంభీర్ ఠాక్రే, బీజేపీ నాయకులు దత్తానిక్కం నవీన్, సందీప్, రాము బర్కాడే కుల సంఘం జిల్లా అధ్యక్షుడు సంతోష్, మండల అధ్యక్షుడు అభయ్, వెంకటి, వివిధ గ్రామాల సర్పంచులు కులస్తులు తదితరులు పాల్గొన్నారు.