31-01-2026 04:37:15 PM
హైదరాబాద్: నల్గొండ జిల్లాలోని(Nalgonda district) నాంపల్లి మండలం కేతేపల్లిలో మహిళ దారుణ హత్యకు గురైంది. సుజాత అనే మహిళ మమత(25)పై పెట్రోల్ పోసి నిప్పంటించింది. మమత భర్త నగేశ్ తో అదే గ్రామానికి చెందిన సుజాతకు వివాహేతర సంబంధం ఉందని గ్రామస్తులు తెలిపారు. సుజాత మమతతో మధ్యాహ్నం గొడవ పడి పెట్రోల్ పోసి నిప్పు పెట్టింది. ఈ ప్రమాదంలో మమత మృతి చెందగా, ఆమె చేతిలో ఉన్న 5 నెలల కుమారుడికి తీవ్రగాయాలయ్యాయి. సగం కాలిన గాయాలతో చిన్నారి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటన తర్వాత సుజాత అక్కడి నుంచి పారిపోయింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు మమత భర్త నగేశ్ ను అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.