31-01-2026 04:43:17 PM
జిల్లా ఎన్నికల అబ్జర్వర్ రవి
తాండూరు,(విజయక్రాంతి): మున్సిపల్ ఎన్నికల్లో అభ్యర్థులు దాఖలు చేసిన నామినేషన్ లను జాగ్రత్తగా సూక్ష్మంగా పరిశీలించాలని జిల్లా ఎన్నికల అబ్జర్వర్ జి. రవి అధికారులకు సూచించారు. శనివారం ఆయన వికారాబాద్ జిల్లా తాండూర్ మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన నామినేషన్ ల సూక్ష్మ పరిశీలన కార్యక్రమాన్ని పరిశీలించారు.
ఈసందర్బంగా ఆయన మాట్లాడుతూ నామినేషన్ లను ఎక్కడ ఎలాంటి పొరపాటు జరగకుండా పూర్తి స్థాయిలో పరిశీలించాలని, ఎన్నికలకు దరఖాస్తు చేసిన అభ్యర్థుల పత్రాలు ఎన్నికల నియమ నిబంధనలకు అనుగుణంగా డాక్యుమెంట్లు ఉన్నాయా లేదా జాగ్రత్తగా నిబంధన బద్దంగా పరిశీలించాలని అన్నారు. ఆయన వెంట కమిషనర్ మధుసూదన్ రెడ్డి, తాసిల్దారులు, ఆర్వోలు తదితరులు పాల్గొన్నారు