31-01-2026 04:13:42 PM
హైదరాబాద్: బీఆర్ఎస్, కాంగ్రెస్ ఒకటే దారిలో నడుస్తున్నాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచందర్ రావు శనివారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆరోపించారు. బీఆర్ఎస్ పార్టీ చేసిన స్కామ్ లను కాంగ్రెస్ కొనసాగిస్తోందని తెలిపారు. గత ప్రభుత్వంలో ఎల్ఆర్ఎస్ స్కీమ్ కింద దరఖాస్తుకే రూ.250 కోట్లు చెల్లించారని రామచందర్ రావు వివరించారు. హోం, విద్య, మున్సిపల్ మంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి ఎక్కడ ఉన్నారు? అని ఆయన ప్రశ్నించారు. ''సార్ లేరు.. సర్కార్ లేదు.. కారు లేదు'' అని రామచందర్ రావు చమత్కరించారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ కలిసి మిమ్మల్ని ఓడించేందుకు కుట్రలు చేస్తున్నాయన్నారు. ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో కూడా బీజేపీ బలంగా ఉందని వెల్లడించారు. మున్సిపల్ ఎన్నికల్లో తాము ఒంటరిగానే పోటీచేస్తామని రామచందర్ రావు తేల్చిచెప్పారు.