29-10-2025 04:41:25 PM
బెల్లంపల్లి (విజయక్రాంతి): పోలీసుల అమరవీరుల వారోత్సవాలను పురస్కరించుకొని బుధ వారం బెల్లంపల్లి పట్టణంలోని పద్మశాలి భవన్ లో పోలీసులు రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బెల్లంపల్లి ఏసీపి ఏ రవికుమార్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలీసు వారోత్సవాల సందర్భంగా పలువురు రక్తదానానికి ముందుకు రావడం అభినందనీయమని అన్నారు. సమాజ హితం కోసం ఏర్పాటు చేసే కార్యక్రమాలకు చేయూతనివ్వాలని కోరారు. అనంతరం బెల్లంపల్లి ఏసిపి రవికుమార్ తోపాటు పలువురు పోలీసు అధికారులు రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి వన్ టౌన్ సిఐ శ్రీనివాసరావు, బెల్లంపల్లి రూరల్ సీఐ హనూక్, తాండూర్, మందమర్రి సిఐలు దేవయ్య, శశిధర్ రెడ్డిలతోపాటు సబ్ డివిజన్ పరిధిలోని ఎస్సైలు పాల్గొన్నారు.