calender_icon.png 30 October, 2025 | 6:12 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆ రెండు పదవులు ఖాళీగా లేవు: అమిత్ షా

29-10-2025 06:50:04 PM

పాట్నా: బీహార్ లోని అసెంబ్లీ ఎన్నికల్లో రాజకీయం వేడి పెరిగింది. ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్ది చలికాలంలో హాట్ హాట్గా మారింది. నేతలు నువ్వా నేనా అన్నట్లుగా ప్రచారం చేస్తున్నారు. బుధవారం బీహార్ లోని దర్భంగాలో జరిగిన ర్యాలీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్బంగా అమిత్ షా మాట్లాడుతూ... ఆర్‌జేడీ, కాంగ్రెస్ పార్టీ వారసత్వ రాజకీయాలు చేస్తున్నాయని మండిపడ్డారు. ఆర్‌జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ తన కుమారుడు తేజస్వి యాదవ్ బీహార్ ముఖ్యమంత్రిగా, కాంగ్రెస్ సీనియర్ నేత సోనియా గాంధీ తమ కుమారులను బీహార్ ముఖ్యమంత్రిగా, తన కుమారుడు రాహుల్ గాంధీని ప్రధానమంత్రిగా చేయాలని కోరుకున్నారని, కానీ రెండు పదవులు ఖాళీగా లేవని ఇండియా కూటమిని ఎగతాళి చేశారు.

మహాఘటబంధన్‌ను దొంగల కూటమి అని ఎద్దేవా చేసిన షా లాలూ యాదవ్ పశుగ్రాసం, బిటుమెన్, భూమి-ఉద్యోగాల కుంభకోణాలలో పాల్గొన్నారని, కాంగ్రెస్ రూ.12 లక్షల కోట్ల అవినీతి కేసుల్లో చిక్కుకుందని ఆరోపించారు. రాష్ట్రంలో మహాఘటబంధన్ అధికారంలోకి వస్తే, కాంగ్రెస్-ఆర్జేడీ కలయిక నిషేధిత పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా సభ్యులను ఉంచడం కొనసాగిస్తుందా అని కేంద్ర హోంమంత్రి ప్రశ్నించారు.పాట్నాలోని ఫుల్వారీ షరీఫ్‌లో పీఎఫ్‌ఐ కార్యకర్తలు చురుగ్గా ఉన్నారని, దేశవ్యాప్తంగా సోదాలు నిర్వహించి ఆ సంస్థ సభ్యులను కటకటాల వెనక్కి నెట్టారు. 

బిహార్‌లో ఆర్‌జేడీ-కాంగ్రెస్ కూటమి అధికారంలోకి వస్తే పీఎఫ్‌ఐ సభ్యులు జైలులోనే ఉంటారని మీరు అనుకుంటున్నారా..? అని ఆయన ప్రశ్నించారు. ఈ తీవ్రవాద సంస్థను నిషేధించింది ఎన్‌డీఏ ప్రభుత్వమేనని అమిత్ షా పేర్కొన్నారు. బెగుసరాయ్ జిల్లాలో జరిగిన మరో ర్యాలీలో అమిత్ షా రాహుల్ గాంధీ ఓటరు అధికార్ యాత్రను విమర్శించారు. కొన్ని నెలల క్రితం చొరబాటుదారులను రక్షించే యాత్ర ప్రారంభించడానికి రాహుల్ గాంధీ  బీహార్‌కు వచ్చారని ఆరోపించారు. రాహుల్ గాంధీ, లాలూ యాదవ్ చొరబాటుదారుల పేర్లు ఓటర్ల జాబితాలో ఉండేలా చూసుకోవాలని కోరుకుంటున్నారని. తేజస్వి, రాహుల్ బీహార్‌లో జంగల్ రాజ్ ను తిరిగి తీసుకురావాలని చూస్తున్నారని కేంద్రం మంత్రి అమిత్ షా తెలిపారు.