29-10-2025 06:52:44 PM
ఘట్ కేసర్ (విజయక్రాంతి): గురుకుల విద్యాసంస్థల పూర్వ వైభవమే లక్ష్యంగా ముందుకు వెళుతున్నట్లు గురుకుల పరిరక్షణ సమితి నాయకులు స్పష్టం చేశారు. ఘట్ కేసర్ పట్టణంలోని గురుకుల కళాశాలలో బుధవారం స్వచ్ఛ గురుకుల(సేవ్ గురుకుల్)లో భాగంగా గురుకుల్ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో స్వచ్ఛభారత్ కార్యక్రమం చేపట్టడం జరిగింది. గురుకుల విద్యాసంస్థలకి పూర్వ వైభవం తేవడానికి ముందుగా పరిసర ప్రాంతాలు మొత్తం శుభ్రం చేసి పిచ్చి మొక్కలను తొలగించడం జరిగింది. ఈ సందర్భంగా గురుకుల పరిరక్షణ సమితి చేస్తున్న కార్యక్రమాలను చూసిన ప్రజలు చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఇంకా ఇటువంటి కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్లి గురుకులకి పూర్వవైభవం తేవడానికి కృషి చేయాలని వారు పలువురు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గురుకుల పరిరక్షణ సమితి సభ్యులు, వాకర్ అసోసియేషన్ సభ్యులు, మున్సిపల్ సిబ్బంది, అన్ని రాజకీయ పార్టీల నాయకులు, జేఏసీ నాయకులు, విద్యార్థులు, గురుకుల కళాశాల, పాఠశాల అధ్యాపకులు, గురుకుల సేవ్ అని నినాదాలు చేస్తూ స్వచ్ఛ గురుకుల కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా గురుకుల పరిరక్షణ సమితి వారు ఈ కార్యక్రమానికి సహకరించిన ఘట్ కేసర్ మున్సిపాలిటీ కమిషనర్, సిబ్బందికి ఘట్ కేసర్ పోలీస్ స్టేషన్ ఇన్ స్పెక్టర్ కి ధన్యవాదాలు తెలియజేశారు. స్వచ్ గురుకుల ప్రతి నెల 4 ఆదివారం రోజు చేపడతామని తెలియజేయడం జరిగింది.