calender_icon.png 30 October, 2025 | 6:01 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

29-10-2025 06:38:59 PM

ఎస్సై మహేశ్వర్..

మొంథా తుఫాన్ ప్రభావంతో మండలంలో జలప్రళయం పరిస్థితులు.. పోలీసులు సూచించిన జాగ్రత్తలు తప్పనిసరి..

చివ్వేంల (విజయక్రాంతి): మొంథా తుఫాన్ ప్రభావంతో చివ్వేంల మండల వ్యాప్తంగా కురుస్తున్న ఎడతెరిపిలేని వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చివ్వేంల ఎస్సై మహేశ్వర్ సూచించారు. భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ఎవరూ నిర్లక్ష్యం చేయకూడదని ఆయన హెచ్చరించారు. ఎస్సై మహేశ్వర్ మాట్లాడుతూ.. “వాగులు, వంకలు, నీటితో నిండిన రహదారులు దాటకండి. కూలిపోయే ప్రమాదం ఉన్న ఇళ్లను వెంటనే ఖాళీ చేయండి. విద్యుత్ పోల్స్, వైర్ల దగ్గరికి వెళ్ళరాదు. చెట్ల కింద నిలబడి ఉండకండి. వర్షం నీరు ఇళ్లలోకి వస్తే వెంటనే సురక్షిత ప్రదేశాలకు వెళ్లండి,” అని ప్రజలకు సూచించారు. అలాగే మండల ప్రజలు పోలీసులు ఇచ్చిన సూచనలు పాటించి, ఏవైనా అత్యవసర పరిస్థితులు తలెత్తినప్పుడు వెంటనే చివ్వేంల పోలీస్ స్టేషన్‌ను సంప్రదించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.