calender_icon.png 30 October, 2025 | 5:55 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గోదావరిలో రాంరెడ్డి దామోదర్ రెడ్డి అస్థికలు నిమజ్జనం

29-10-2025 06:33:29 PM

తుంగతుర్తి (విజయక్రాంతి): మాజీమంత్రి, సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు రాంరెడ్డి దామోదర్ రెడ్డి అస్థికలను గోదావరి నదిలో కుమారుడు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి బుధవారం నిమజ్జనం చేశారు. భద్రాచలం క్షేత్రంలోని గోదావరి నదిలో కుమారుడు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డితో పాటు కుటుంబ సభ్యులు అర్చకుల వేదమంత్రోచ్ఛరణల నడుమ శాస్త్రోక్తంగా గోదావరి నదిలో నిమజ్జనం చేశారు. కార్యక్రమంలో దామోదర్ రెడ్డి సోదరులు గోపాల్ రెడ్డి క్రిష్ణా రెడ్డి, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు పోతు భాస్కర్, దండు మైసమ్మ దేవస్థానం చైర్మన్ తంగేళ్ళ కరుణాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.