29-10-2025 06:47:26 PM
ఘట్ కేసర్ (విజయక్రాంతి): రక్తదానం మరొకరికి ప్రాణదానం కావున యువత ముందుకు వచ్చి రక్తదానం చేయాలని ఘట్ కేసర్ ఇన్స్పెక్టర్ ఎం. బాలస్వామి అన్నారు. పోలీస్ అమరవీరుల దినోత్సవం సందర్బంగా ఈనెల 30వ తేదీ గురువారం ఉదయం 9:00 గంటలకు రాచకొండ మల్కాజిగిరి డీసీపీ ఆధ్వర్యంలో నాచారం పోలీస్ స్టేషన్ పరిధిలో గల విఎన్ఆర్ గార్డెన్స్ మల్లాపూర్ నందు మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. కావున మన ఘట్ కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గల యువత అందరూ అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయగలరని కోరారు.
సంప్రదించవలిసిన ఫోన్ నెంబర్లు.. ఎస్ఐలు
ప్రభాకర్ రెడ్డి 8712662185,
ఎ. శేఖర్ 8712662183,
ఎ. రాఘవేంద్ర 8712662184,
ఎస్.కె. హీన 8712662182