calender_icon.png 30 October, 2025 | 6:09 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రక్తదానం ప్రాణదానంతో సమానం

29-10-2025 06:50:28 PM

ఎల్లారెడ్డి సిఐ రాజారెడ్డి

ఎల్లారెడ్డి (విజయక్రాంతి): రక్తదానం ప్రాణదానంతో సమానమని ఎల్లారెడ్డి, సిఐ రాజారెడ్డి, ఎస్సై మహేష్ కుమార్ అన్నారు. పోలీస్‌ అమరవీరుల వారోత్సవాల భాగంగా, బుధవారం ఎల్లారెడ్డి పట్టణంలోని ముత్యపు రాఘవులు ఫంక్షన్ హాల్ లో, ఎల్లారెడ్డి సర్కిల్ పోలీస్‌స్టేషన్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా రక్తదాన శిబిరంలో 55 మంది యువకులు రక్తదానం చేశారు. అనంతరం సిఐ రాజారెడ్డి మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాలు సంభవించినప్పుడు సకాలంలో రక్తం అందక చాలామంది మృత్యువాత పడుతున్నారన్నారు.

యువత సన్మార్గంలో పయనించి శాంతిభద్రతల పరిరక్షణకు పాటుపడాలని, చెడు అలవాట్లకు దూరంగా ఉంటూ పోలీసులకు సహకరించాలన్నారు. ట్రాఫిక్‌ నియమ నిబంధనలు పాటిస్తే ఎలాంటి ప్రమాదాలు ఉండవని, పోలీసులు ప్రజల కోసమే 24 గంటలు విధి నిర్వహణలో ఉంటారన్నారు. అనంతరం మృతి చెందిన పోలీస్‌ అమరవీరులకు మౌనం పాటించారు. ఈ కార్యక్రమంలో ఎల్లారెడ్డి ఎస్సై మహేష్, నాగిరెడ్డి పేట ఎస్సై భార్గవ్ గౌడ్, లింగం పేట ఎస్సై, దీపక్, గాంధారి ఎస్సై ఆంజనేయులు, పోలీస్ స్టేషన్ ల సిబ్బంది అనిల్ గౌడ్, బాలకృష్ణ, సాయికిరణ్, సందీప్ తదితరులు పాల్గొన్నారు.