29-10-2025 06:28:27 PM
కోదాడ: తుఫాను కారణంగా కోదాడ పట్టణంలో లోతట్టు ప్రాంతాలు బుధవారం జలమయంగా మారాయి. పట్టణంలోని శ్రీమన్నారాయణ కాలనీ, హుజూర్ నగర్ రోడ్డులోని ఆపిల్ హాస్పిటల్ ఏరియా, కొత్త సబ్-రిజిస్ట్రార్ ఆఫీస్ ఏరియా, భవానీ నగర్ ప్రాంతాలు జలమయంగా మారాయి. లోతట్టు ప్రాంతాల్లో వర్షపు నీరు ఇళ్లలోకి చేరింది. నాలా ఉధృతంగా ప్రవహిస్తుండడంతో పరిసర ప్రాంతాల్లో వర్షపు నీరు ఇళ్లలోకి చేరి ఇబ్బందులు పడ్డారు. గత సంవత్సరం ఇదే మాదిరిగా భారీ వర్షం కారణంగా ఇళ్లలోకి నీరు చేరి ప్రజలు నష్టపోయిన సంగతి తెలిసిందే. డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపర్చి, కాల్వ ఆక్రమణలు లేకుండా చూస్తే వర్షపు నీరు ఇళ్ళలోకి రాకుండా ఉంటుందని ప్రజలు అంటున్నారు.