calender_icon.png 23 November, 2025 | 8:17 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కన్నాయిగూడెం ప్రధాన రహదారిపై వాహనాల తనిఖీలు చేసిన పోలీసులు

23-11-2025 08:14:14 PM

హెల్మెట్ ధరించడం వలన ప్రాణాలు కాపాడుకోవచ్చు..

స్థానిక ఎస్సై ఇనిగాల వెంకటేష్

కన్నాయిగూడెం (విజయక్రాంతి): ములుగు జిల్లా కన్నాయిగూడెం మండల కేంద్రంలో గల ప్రధాన రహదారిపై వాహనాల తనిఖీలు స్థానిక ఎస్సై ఇనిగాల వెంకటేష్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ ప్రధాన రహదారిపై కన్నాయిగూడెం మండలం నుండి ఏటూరునాగారం వైపుగా వచ్చి పోయో వాహనాలను క్షుణ్ణంగా తనిఖీలు చేశారు, అనుమానితులను అదుపులోకి తీసుకుని వివరాలు సేకరించి వాహనాలకు సంబంధించిన డ్రైవింగ్ లైసెన్సు పేపర్లను పరిశీలించి వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ఖచ్చితంగా ధరించాలని హెల్మెట్ లేనియెడల జరిమాన విదిస్తామని హెచ్చరించారు. హెల్మెట్ ధరించడం వలన ప్రాణాలు కాపాడుకోవచ్చని వారికి తెలిపారు. ఈ కార్యక్రమంలో వాహనా దారులు,సివిల్ మరియు సీఆర్పీఎఫ్ పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.