calender_icon.png 23 November, 2025 | 8:22 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సాంస్కృతిక ఉత్సవాలలో జయ విద్యార్థుల ప్రతిభ

23-11-2025 07:47:29 PM

కోదాడ: నేస్తం ఫౌండేషన్ ఆధ్వర్యంలో బజ్జూరి నర్సిరెడ్డి స్మారక బాలోత్సవ్ 2025 6వ అంతర పాఠశాల సాంస్కృతిక ఉత్సవాలు గత రెండు రోజులుగా ఘనంగా నిర్వహించారు. ఈ ఉత్సవాలలో భాగంగా జరిగిన వివిధ పోటీలలో జయ పాఠశాల కోదాడ విద్యార్థులు ప్రతిభ కనబరిచారు క్విజ్ పోటీలలో ప్రధమ బహుమతి, వకృత్వ పోటీలో ప్రథమ బహుమతి, సోలో డాన్స్ లో ద్వితీయ బహుమతి, చిత్ర లేఖనంలో తృతీయ బహుమతి సాధించారు. ఈ పోటీలలో పాల్గొన్న విద్యార్థులను పాఠశాల కరస్పాండెంట్ జయ వేణుగోపాల్, డైరెక్టర్లు బింగిజ్యోతి, జెల్లా పద్మ, ప్రధానోపాధ్యాయులు చిలువేరు వేణు అభినందించారు. జయ విద్యార్థులు అంటే కేవలం ఐఐటీ కే పరిమితం కాదు అన్ని రంగాలలో రాణిస్తారని తమ ప్రతిభను ఇంతటితో ఆపకుండా భవిష్యత్తులో అనేక పోటీ పరీక్షల్లో రాణించాలని తెలిపారు.