23-11-2025 08:00:04 PM
నిర్మల్ (విజయక్రాంతి): నిర్మల్ జిల్లాలోని ఆయా పోలీస్ స్టేషన్ల పరిధిలో ఆదివారం జిల్లా ఎస్పీ జానకి షర్మిల ఆదేశాల మేరకు డిఫెన్స్ డ్రైవింగ్ పై ప్రజలకు అవగాహన కల్పించారు. రోడ్లపై వెళ్తున్న వాహనదారులను ఆపి రోడ్డు ప్రయాణం పరిమితికి మించిన వేగంతో వెళ్ళవద్దని హెల్మెట్ ధరించుకోవాలని రోడ్డు భద్రతలను పాటించాలని ప్రమాదంలో గాయపడితే ప్రభుత్వ ఆసుపత్రులకు తరలించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆయా పోలీస్ స్టేషన్లు ఎస్సైలు మహిళా శక్తి పోలీసులు పాల్గొన్నారు.