calender_icon.png 23 November, 2025 | 8:22 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి: ఎమ్మెల్యే మందుల సామేలు

23-11-2025 07:49:02 PM

​నూతనకల్ (విజయక్రాంతి): మండల కేంద్రంలోని కేడీఆర్ ఫంక్షన్ హాల్లో ఆదివారం ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామేలు ముఖ్య అతిథిగా విచ్చేసి మహిళలకు చీరలను పంపిణీ చేశారు.​ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మహిళా సంక్షేమం కోసం ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తోందని తెలిపారు. మహిళలు ఆర్థికంగా, సామాజికంగా బలోపేతం కావాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని పేర్కొన్నారు.​

ఈ కార్యక్రమంలో తుంగతుర్తి మార్కెట్ కమిటీ చైర్మన్ తీగల గిరిదర్ రెడ్డి, పిఏసియస్ చైర్మన్ నాగం జయసుధ సుధాకర్ రెడ్డి,జిల్లా నాయకులు దరిపెల్లి వీరన్న,పాల్వాయి నాగరాజు, మిర్యాల గ్రామ శాఖ అధ్యక్షులు మన్నెం దశరథ,నాయకులు అనంతుల శ్రీను,గుణగంటి వెంకన్న,కనకటి పల్ల వెంకన్న,ఇరుగు కిరణ్,మెంచు లింగమల్లు, వేల్పుల కిరణ్,ఇతర ముఖ్య నాయకులు, స్థానిక ప్రజా ప్రతినిధులు, పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు.