calender_icon.png 23 November, 2025 | 8:22 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆర్ఎస్ఎస్ జన జాగరణ అభియాన్ ప్రారంభం..

23-11-2025 07:46:03 PM

సుల్తానాబాద్ (విజయక్రాంతి): రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా సుల్తానాబాద్ పట్టణంలో జన జాగరణ అభియాన్ కార్యక్రమం ప్రారంభమైంది. పట్టణంలోని శ్రీ పెరుకగిద్దె హనుమాన్ దేవాలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమం నిర్వహించిన అనంతరం కార్యక్ర‌మాన్ని అధికారికంగా ప్రారంభించారు. హిందూ సమాజాన్ని సంఘటితం చేయడం, అఖండ భారత్ సాధన లక్ష్యంగా ఆదివారం నగరంలోని ఇంటి ఇంటికి గృహ సంపర్కం నిర్వహిస్తూ కరపత్రాల పంపిణీ చేపట్టారు. ప్రజల్లో అవగాహన పెంపొందించడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యమని నిర్వాహకులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో విభాగ్ సహా వ్యవస్థ ప్రముఖ్ దావులూరి మురళీధర్‌తో పాటు పలువురు ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు.