calender_icon.png 23 November, 2025 | 8:22 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సౌదీ రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన కుటుంబాలకు సీఎం రేవంత్ కృషి అభినందనీయం

23-11-2025 07:53:24 PM

రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ

కామారెడ్డి (విజయక్రాంతి): సౌదీ అరేబియాలోని మదిన సమీపంలో జరిగిన బస్సు అగ్నిప్రమాదంలో హైదరాబాద్కు చెందిన 45 మంది ఉమ్రా యాత్రికులు ప్రాణాలు కోల్పోయిన కుటుంబ సభ్యులను మక్కాకు వెళ్లేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎంతో కృషి చేసినట్లు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ తెలిపారు. ఆదివారం కామారెడ్డిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. సత్వరంగా స్పందించి మదిన బస్సు ప్రమాదంలో మృతి చెందిన కుటుంబాలు దుఃఖంలో ఉన్న సమయంలో నిర్ణయాత్మకంగా నిర్ణయం తీసుకోవడం పట్ల కృతజ్ఞతలు తెలిపారు. బాధిత కుటుంబాలకు చాలా అవసరమైన సహాయాన్ని అందించారన్నారు.

ఆలస్యం లేకుండా ప్రత్యేక హెల్ప్ లైన్ కౌంటర్ ఏర్పాటు చేసి బంధువులకు సాయం చేయడానికి హెల్ప్ లైన్ నెంబర్లు విడుదల చేయడమే కాకుండా బాధ్యత కుటుంబాలను వ్యక్తిగతంగా కలిసి ఆదుకునేందుకు కాంగ్రెస్ సీనియర్ నేతలు ప్రభుత్వ అధికారుల బృందాన్ని నియమించింది అన్నారు. విదేశీ వివరాల మంత్రిత్వ శాఖతో ప్రత్యేకంగా మాట్లాడి సౌదీ అరేబియాలోని భారతీ అధికారులను పూర్తి సహకారం, అందేలా చేశారన్నారు. రాష్ట్ర మంత్రివర్గం ప్రతి కుటుంబానికి 5 లక్షల ఎక్స్ గ్రేషియా అదే రోజు ప్రకటించారన్నారు. తెలంగాణ ప్రభుత్వం తాయిత కుటుంబ సభ్యులను అధికారిక ప్రతినిధి బృందంతో పాటు అన్ని ఖర్చులను భరించి సౌదీ అరేబియా కు వెళ్లడానికి ఏర్పాట్లు చేశారన్నారు.

సరైన సమయంలో స్పందించి జోకింగ్ తీసుకున్నందుకు ధన్యవాదాలు మస్జీద్ ఏ నా బాబాయ్లో ఆల్ జనాజ తర్వాత మదినాలోని జనత్ బాకీలో హైదరాబాద్ ఉమ్రాయాత్రేకుల అంతేక్రియలు గౌరవప్రదంగా నిర్వహించడం జరిగిందన్నారు. బాయ్ అయితే కుటుంబాల బాధను ఎవరు తీర్చలేనిది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సాయి సహకారాలు అందించి వారికి అండగా ఉన్నందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ సమావేశంలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ నిమ్మ మోహన్ రెడ్డి, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు గూడెం శ్రీనివాస్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.