23-11-2025 08:08:09 PM
పరీక్షకు 800 మంది విద్యార్థులు హాజరు, వీరిలో 10 మంది విద్యార్థులకు ఉచిత విద్య..
డిసెంబర్ 1న ఫలితాలు..
వడ్లకొండ వేణుగోపాల్ గౌడ్, చైర్మన్ మోషన్ జూనియర్ కాలేజీ..
హనుమకొండ (విజయక్రాంతి): హన్మకొండ నయీమ్ నగర్ లోని మోషన్ ఐఐటీ, నీట్ జూనియర్ కాలేజీలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు మోషన్ టాలెంట్ టెస్ట్ నిర్వహించడం జరిగింది. ఈ పరీక్షకు దాదాపు 800 విద్యార్థులు హాజరైయ్యారని మోషన్ కాలేజీ చైర్మన్ వడ్లకొండ వేణుగోపాల్ గౌడ్ తెలిపారు.
దేశంలోని ఐఐటీ, నీట్ కోచింగ్ కు అగ్రగామి విద్య సంస్థ ఆయన కోటా రాజస్థాన్ మోషన్ ఐఐటీ, నీట్ ఇన్స్టిట్యూట్ దేశ వ్యాప్తంగా ఈ టాలెంట్ టెస్ట్ నిర్వహిస్తుందని దేశవ్యాప్తంగా వీరిలో 500 మంది విద్యార్థులకు ఉచిత విద్య, 2 కోట్ల 50 లక్షల ప్రైజ్ మనీ ఇవ్వనున్నట్లు, అలాగే హన్మకొండ సెంటర్ నుండి మెరిట్ సాధించిన 10 మంది విద్యార్థులకు ఉచిత విద్యతో పాటు మొదటి ర్యాంక్ సాధించిన విద్యార్ధికి లాప్ టాప్, రెండవ ర్యాంక్ సాధించిన విద్యార్ధికి ఐపాడ్ ఇవ్వనున్నట్లు చెప్పారు.
ఈ పరీక్ష ఫలితాలు డిసెంబర్ 1వ తేది ప్రకటించనున్నట్లు వేణుగోపాల్ గౌడ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో మోషన్ కాలేజీ బ్రాంచ్ హెడ్ ముత్యాల సురేష్, కోటా అధ్యాపకులు అనుజ్ కపూర్, పాఠక్, సురేందర్, మిథున్, కాలేజీ సిబ్బంది రాజు, రమేష్, లక్ష్మణ్, సుమన్, మౌనిక, ఉమ, కుమార్, నాగరాజు, సురేందర్, మనోహర్, వెంకట్, రంజిత్, అనిల్, సంతోష్ రవీందర్ తదితరులు పాల్గొన్నా రు.