28-11-2025 09:36:23 PM
తూప్రాన్,(విజయక్రాంతి): తూప్రాన్ పట్టణ కేంద్రంలోని నర్సాపూర్ బ్రిడ్జి వద్ద పోలీసులు వాహనాల తనిఖీ చేస్తుండగా ఒక వ్యక్తి పోలీసులను గమనించి పారిపోతుండగా తక్షణమే పోలీసులు పారిపోతున్న వ్యక్తిని పట్టుకొని విచారించగా తన పేరు కట్ట నవీన్ 26 తండ్రి బిక్షపతి కులం ఎస్సీ అని తెలుపుతూ నేను ఈనెల 25న తూప్రాన్ పట్టణంలోని ఒక బిల్డింగ్ లో దొంగతనం చేసినానని కాజేసిన సొమ్మును నర్సాపూర్ లో అమ్ముకుందామని వెళుతుండగా మీకు పట్టు పడడం జరిగిందని వివరించాడు. తన వద్ద ఉన్న నగలను చూపించగా 7 తులాల బంగారు నగలు, 37 తులాల వెండి నగలు, 20,000 వేల నగదు, ఒక వాచ్ కనిపించడం జరిగింది. వీటిని స్వాధీన పరుచుకోవడం జరిగిందని ఒక ప్రకటన ద్వారా సిఐ రంగాకృష్ణ ఎస్సై శివానందం తెలిపారు. ఇందులో పోలీస్ సిబ్బంది, తదితరులు ఉన్నారు.