calender_icon.png 28 November, 2025 | 9:08 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

'డ్రంక్ అండ్ డ్రైవ్'లో భారీగా జరిమానా

28-11-2025 08:59:23 PM

- 35 మందికి రూ.3 లక్షల 55 వేలు

- ఇద్దరికి జైలు శిక్ష

సిద్దిపేట క్రైం: సిద్దిపేట ట్రాఫిక్ పోలీసుల తనిఖీల్లో మద్యం తాగి  వాహనాలు నడిపిన 35 మందికి  రూ.3 లక్షల 55 వేలు  జరిమానా పడిందని సిద్దిపేట ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ కె. ప్రవీణ్ కుమార్ తెలిపారు. కొన్ని రోజుల క్రితం సిద్దిపేట పట్టణంలోని నర్సాపూర్, ఎంపీడీవో ఆఫీస్ చౌరస్తాలతోపాటు రాజీవ్ రహదారిపై వాహనాలు తనిఖీ చేయగా, 35 మంది మద్యం తాగి  వాహనాలు నడుపుతూ పట్టుబడ్డారని చెప్పారు. వారిని శుక్రవారం  సిద్దిపేట ఒకటవ అడిషనల్ జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ తరణి ఎదుట హాజరుపరచగా విచారణ జరిపి జరిమానా విధించారని తెలిపారు. వారిలో ఒకరికి వారం,  మరొకరికి మూడు రోజుల జైలు శిక్ష విధించారని తెలిపారు.