28-11-2025 09:01:46 PM
మేడిపల్లి,(విజయక్రాంతి): బోడుప్పల్ నగరపాలక సంస్థ పరిధిలో 3వ దశ ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ మంజూరు పత్రాల పంపిణి మున్సిపల్ కార్యాలయ ఆవరణలో మాజీ మేయర్ తోటకూర అజయ్ యాదవ్, అసిస్టెంట్ మున్సిపల్ కమిషనర్ శ్యాంసుందర్ రావుతో కలిసి 83 మంది లబ్ధిదారులకు మంజూరు పత్రాలు అందజేశారు. గతములో ఇచ్చిన 118 మంది లబ్ధిదారులతో కలుపుకొని మొత్తముగా 201 మంది లబ్ధిదారులకు అందజేశామని అన్నారు. ఈ కార్యక్రమంలో హౌసింగ్ ఎ.ఇ. అల్లాజీ, కొత్త కిషోర్ గౌడ్ , ఇందిరమ్మ కమిటీ సభ్యులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.