28-11-2025 08:53:35 PM
సర్పంచి స్థానానికి 25, వార్డు స్థానాలకు 22 నామ పత్రాల దాఖలు
నామినేషన్ ప్రక్రియను పర్యవేక్షించిన అదనపు కలెక్టర్ నగేష్
పాపన్నపేట,(విజయక్రాంతి): పాపన్నపేట మండలంలో నామినేషన్ల పర్వం రెండో రోజైన శుక్రవారం అట్టహాసంగా కొనసాగింది. మండలంలోని 40 గ్రామ పంచాయతీలకు మండల పరిషత్తు కార్యాలయంలో నామినేషన్లు స్వీకరిస్తున్నారు. అందుకు కార్యాలయంలో 10 కౌంటర్లు ఏర్పాటు చేశారు. ఉదయం 10 గంటల నుంచి నామపత్రాల స్వీకరణ మొదలు పెడుతున్నారు. మొదటి రోజైన గురువారం సర్పంచ్ స్థానానికి 13 నామినేషన్లు దాఖలు చేశారు.
రెండో రోజు అయిన శుక్రవారం సర్పంచ్ స్థానానికి 25, వార్డు స్థానాలకు 22 మంది నామినేషన్లు దాఖలు చేశారు. సర్పంచి స్థానానికి పాపన్నపేట నుంచి లింగంపేట పావని నరేందర్ గౌడ్ నామినేషన్ దాఖలు చేశారు. అబ్లాపూర్ నుంచి నిరుడి వెంకటేశం, కుర్తివాడ వడ్డేపల్లి గోపాల్, జయపురం మేడిద అనసుజ, నార్సింగ్ నుంచి గాండ్ల నాగరాజు, తదితరులు నామినేషన్లు దాఖలు చేశారు. వార్డు సభ్యుల స్థానాలకు 22 మంది నామినేషన్లు దాఖలు చేశారని ఎంపీడీవో విష్ణువర్ధన్ తెలిపారు. జిల్లా అదనపు కలెక్టర్ నగేష్ నామినేషన్ ప్రక్రియను పర్యవేక్షించారు