28-11-2025 08:56:51 PM
సంగారెడ్డి,(విజయక్రాంతి): సంగారెడ్డి ఆర్టీసీ డిపో పరిధిలో సేవల మెరుగుదలకు ప్రత్యేకంగా ‘డయల్ యువర్ డీఎం’ కార్యక్రమం రేపు నిర్వహించనున్నట్లు ఆర్టీసీ డిపో మేనేజర్ పి. ఉపేందర్ ఒక ప్రకటనలో తెలిపారు. రేపు ఉదయం 11గం. నుండి మధ్యాహ్నం 12 గం. వరకు ప్రజలు తమ సూచనలు, సలహాలు, సమస్యలను నేరుగా తెలియజేయడానికి 8500376267 నెంబర్‌కు ఫోన్ చేయవచ్చని తెలిపారు.
ఆర్టీసీ సేవల నాణ్యతను పెంచేందుకు ప్రజల అభిప్రాయాలు అత్యంత కీలకమని ఆయన అన్నారు. సంగారెడ్డి డిపో పరిధిలోని వివిధ మండలాలకు చెందిన ఉద్యోగులు, వ్యాపారులు, విద్యార్థులు, సాధారణ ప్రజలు ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకుని ఆర్టీసీ సేవల అభివృద్ధికి తమ వంతు సూచనలు అందించాలని డీఎం కోరారు.