calender_icon.png 13 November, 2025 | 2:36 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

లాడ్జిల్లో పోలీసుల తనిఖీలు

13-11-2025 12:00:00 AM

మహబూబాబాద్, నవంబర్ 12 (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో బుధవారం పోలీసులు లాడ్జిల్లో తనిఖీలు నిర్వహించారు. వివిధ అవసరాల నిమిత్తం జిల్లా కేంద్రానికి వచ్చిలాడ్జిలలో బసచేసే వారి వివరాలను, లాడ్జీల్లోని రికార్డులను పట్టణ సీఐ గట్ల మహేందర్ రెడ్డి పరిశీలించారు.

ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ లాడ్జీల్లో ఎలాంటి అసాంఘిక కార్యక్రమాలకు తావివ్వకుండా జాగ్రత్తలు వహించాలని, లాడ్జిల్లో బసచేసే వారి వద్దనుండి సరైన ధ్రువీకరణ పత్రాలు తీసుకోవాలని, పూర్తి వివరాలు రికార్డుల్లో నమోదు చేయాలని సీసీ కెమెరాల నిర్వహణ సక్రమంగా ఉండేలా చూసుకోవాలని సూచించారు.

చట్ట విరుద్ధంగా ఎవరికీ గదులు ఇవ్వవద్దని, అనుమానితుల వివరాలను వెంటనే తమకు తెలియజేయాలని సూచించారు. నిబంధనలు పాటించని వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు, ఈ తనిఖీల్లో టౌన్ ఎస్‌ఐ లు అరుణ్ కుమార్, అలీం హుస్సేన్, సూరయ్య ,పోలీస్ స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు.