12-11-2024 12:29:01 PM
వికారాబాద్,(విజయక్రాంతి): వికారాబాద్ దాడి ఘటనపై పోలీసులు ముమ్మర దర్యాప్తు ప్రారంభించారు. జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, తహశీస్దర్, అధికారులపై దాడి ఘటనలో పోలీసులు ఇప్పటి వరకు లగచర్ల గ్రామంలోని 55 మంది నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఫార్మా కంపెనీకి కావాల్సిన భూసేకరణ కోసం లగచర్ల గ్రామానికి వచ్చిన అధికారులపై గ్రామాస్తులు దాడికి పాల్పడారు. ఈ దాడి ఘటన దృశ్యాలను పరిశీలించిన పోలీసులు ప్రణాలిక ప్రకారమే జరిగిందని, దాదాపుగా వంద మంది దాడికి పాల్పడినట్లు గుర్తించారు. దీంతో కొడంగల్ నియోజకవర్గం దుద్యాల మండలం లగచర్లో పోలీసులు బలగాలు భారీగా మోహరించి, దుద్యాల, కొడంగల్, బొంరాస్ పేట మండలాల్లో అంతర్జాల సేవలను నిలిపివేశారు.