calender_icon.png 21 October, 2025 | 6:04 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పోలీసు అమరవీరుల త్యాగాలను ఎప్పటికీ మర్చిపోలేము: ఎస్పీ మహేష్ బి గీతే

21-10-2025 01:58:13 PM

రాజన్న సిరిసిల్ల,(విజయక్రాంతి): జిల్లాలోని చందుర్తి మండలం పోలీస్ అమరవీరుల త్యాగాలను ఎప్పటికీ మర్చిపోలేమని, రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ మహేష్ బి.గితే పేర్కొన్నారు. పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవంలో భాగంగా చందుర్తి మండలం లింగంపేట గ్రామ శివారులోని అటవీ ప్రాంతంలోని అమరవీరుల స్తూపం వద్ద మంగళవారం ఎస్పీ మహేష్ బి.గితే నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ... సమాజంలో శాంతి భద్రతలను కాపాడుతూ ప్రతినిత్యం ప్రజల రక్షణ కోసం, కర్తవ్యదీక్షలో ప్రాణ త్యాగాలు చేసిన యోధుల సేవలు ఎంతో స్ఫూర్తి దాయకమన్నారు.