calender_icon.png 21 October, 2025 | 8:17 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆలేటి లింగమ్మ మృతికి వీరేశం సంతాపం

21-10-2025 06:04:33 PM

నకిరేకల్ (విజయక్రాంతి): శాలిగౌరారం మండలం తుడిమిడి గ్రామానికి చెందిన ఆలేటి శ్రీనివాస్ (పవన్ సాయి హాస్పిటల్ అధినేత) మాతృమూర్తి ఆలేటి లింగమ్మ అనారోగ్యంతో మృతి చెందింది. మంగళవారం నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం మృతదేహాన్ని సందర్శించి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయన వెంట నకిరేకల్ మున్సిపల్ చైర్మన్ చౌగోని రజిత శ్రీనివాస్ గౌడ్ తో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారు.