calender_icon.png 20 September, 2025 | 4:25 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మా గ్రామానికి కేటాయించిన భూమి.. ఇతర గ్రామాలకు ఇవ్వొద్దు

20-09-2025 02:21:31 PM

మంథని ఆర్డీఓ సురేష్ కు వినతిపత్రంలో రచ్చపల్లి మాజీ సర్పంచి కనవేన శ్రీనివాస్ 

మంథని,(విజయక్రాంతి): మా గ్రామానికి కేటాయించిన భూమిని ఇతర గ్రామాలకు వారికి ఇవ్వద్దని మంథని ఆర్డీఓ సురేష్ కు రచ్చపల్లి మాజీ సర్పంచి కనవేన శ్రీనివాస్ వినతిపత్రంలో తెలిపారు. శనివారం మంథని ఆర్డీఓ, ఆర్ అండ్ ఆర్  అధికారి సురేష్ ను కలిసి మా రచ్చపల్లి గ్రామంలోని ఆర్జీ-3, ఓసీపీ-2 మైన్ విస్తరణలో భాగంగా  గ్రామంలోని మొత్తం వ్యవసాయ భూములు , ఇండ్లు పూర్తిగా సింగరేణి యాజమాన్యం  తీసుకొని, మాకు పునరావాసం కాలనీ కింద,  మంథని మండలంలోని బిట్టిపల్లి శివారులో 372/2 గల సర్వే నెంబర్లు 77 ఎకరాల 20 గుంటల భూమిని మా గ్రామానికి కేటాయించి, హద్దులు పెట్టి గతంలో సింగరేణి,  గవర్నమెంట్ సర్వే వారు నివేదిక ఇవ్వడం జరిగిందని, అ 77.20  ఎకరాలలో గ్రామ పంచాయతీ భవనం, ప్రాథమిక పాఠశాల, అంగన్వాడి సెంటర్, పార్కు, కమ్యూనిటీ హాల్,టెంపుల్స్' ఇంటర్నల్ రోడ్స్, డ్రైనేజీస్, వాటర్ ట్యాంక్, పైప్ లైన్స్, సెగ్రిగేషన్ షెడ్, స్మశాన వాటిక, దోబీ ఘాట్, చెరువు, గ్రామంలో 572 మంది లబ్ధిదారులకు 242 గజాల చొప్పున ఇంటి స్థలాన్ని( ప్లాట్) కేటాయించారని, అంతేకాకుండా గ్రామంలో భవిష్యత్తు అవసరాల కోసం గ్రామ అభివృద్ధి కోసం కొంత ఖాళీ స్థలాన్ని 72 ఎకరాలు 20 గుంటల్లోనే కేటాయించడం జరిగిందన్నారు.

గతంలో గ్రామ పంచాయతీ గెజిట్ నోటిఫికేషన్ కోసం సింగరేణి ఎస్టేట్ సంబంధించిన అధికారులు గవర్నమెంట్ సంబంధించిన సర్వేయర్,(డీఏ) డిస్టిక్ సర్వేయర్ రెవిన్యూ అధికారులు బిట్టుపల్లి శివారులోని 372/2 సర్వేనెంబర్ లో 77 ఎకరాల 20 గుంటలు భూమిని పూర్తిస్థాయిలో సర్వే చేసి మ్యాప్ తో పెద్దపెల్లి జిల్లా (డీపీఓ) పంచాయతీ అధికారికి  సమర్పించామని, అక్కడ నుండి జిల్లా కలెక్టర్ కు  సమర్పించి కలెక్టర్ నుండి తెలంగాణ పంచాయతీ రాజ్ కమిషనర్ హైదరాబాద్ కు నివేదిక పంపించి, గ్రామ పంచాయతీ గెజిట్ నోటిఫికేషన్ మంజూరు చేపించుకోవడం జరిగిందన్నారు. మా గ్రామానికి కేటాయించిన 77 ఎకరాల 20 గుంటల భూమిలో పెద్దంపేట్, మంగళపల్లి గ్రామాలకు చెందిన వారికి కోర్టు నుండి ఆదేశాలు వచ్చినయని, మా గ్రామానికి కేటాయించిన భూమిలో వారికి ఇంటి స్థలాలను ఇవ్వడం జరిగిందని,  కావున తమరు గతంలో మా గ్రామ అభివృద్ధి కోసం మా గ్రామానికి కేటాయించిన 77 ఎకరాల 20 గుంటల భూమి మా గ్రామ పంచాయతీకి సరెండర్ చేసి, మా గ్రామంలోని భూ నిర్వాసితులు ఎవరికైనా కోర్టు నుండు గానీ, ప్రభుత్వం నుండి గానీ, ఇంటి స్థలాలు ఇవ్వాలని ఆదేశాలు వస్తే, మా గ్రామనీకి చెందిన వారికీ మంజూరు చేపించి, వారికె కేటాయించాలని  కోరారు.  పెద్దంపేట, మంగళపల్లి మిగతా గ్రామాల వారికి మా గ్రామంలో కేటాయించిన ఇంటి స్థలాలను మా గ్రామ పంచాయతీలో నుండి వారిని తొలగించి బిట్టుపల్లి శివారులో గాని ప్రభుత్వం భూమిలో ఇంకెక్కడైన గానీ వారికి ఇవ్వాలని వినతి పత్రము అందించారు. ఈ  కార్యక్రమం లో మాజీ సర్పంచ్ కనవేన శ్రీనివాస్, మాజీ ఉప సర్పంచ్ గుర్రం సదానందం. మాజీ వార్డ్ మెంబెర్ సింగనవేన నాగరాజు పాల్గొన్నారు.