20-09-2025 02:24:42 PM
వేములవాడ టౌన్ (విజయక్రాంతి): వేములవాడ మున్సిపల్ పరిధిలోని నాంపల్లి ప్రాథమికోన్నత పాఠశాలలో తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ప్రత్యేక ఆకర్షణగా గాజుల బతుకమ్మను విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు కలిసి రూపుదిద్దారు. తరువాత విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు అందరూ కలసి బతుకమ్మ ఆడి, పాడుతూ ఉత్సవాలను మరింత రంగరించారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయురాలు వత్సలతో పాటు ఉమాదేవి, రజిత, వినయ్ కుమార్, కమలాకర్ రెడ్డి, సన, శైలజ తదితర ఉపాధ్యాయులు పాల్గొన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు కూడా ఉత్సాహంగా పాల్గొని బతుకమ్మ వేడుకలను విజయవంతం చేశారు.