calender_icon.png 7 August, 2025 | 4:20 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పేకాట స్థావరంపై పోలీసుల దాడి

06-08-2025 10:49:12 PM

టేకులపల్లి (విజయక్రాంతి): టేకులపల్లి మండలం(Tekulapally Mandal) లచ్చగూడెం గ్రామం ఊరు చివరలో గల మామిడి తోటలో కొంతమంది వ్యక్తులు పేకాట ఆడుతున్నారని సమాచారంతో బోడు పోలీసులు బుధవారం తనిఖీ చేసి పట్టుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. సమాచారంతో పోలీసులు అక్కడికి వెళ్లి తనిఖీ చేయగా ఆ ప్రదేశంలో లచ్చగూడెం గ్రామానికి చెందిన చీమల ప్రసాద్, దొడ్డ రాజేష్, కాలం భాను ప్రకాష్, దొడ్డ వసంతరావు, కిష్టారం గ్రామానికి చెందిన వేప హనుమంతరావులను పేక ఆడుతుండగా పట్టుకున్నారు. అక్కడి నుండి పాయం సత్యం, దొడ్డ ముక్తేష్, జబ్బ కళ్యాణ్ అనే వ్యక్తులు పారిపోయారని, దొరికిన వ్యక్తుల వద్ద నుంచి రూ.3,200 నగదు, 5 సెల్ ఫోన్లు , 4 మోటర్ సైకిల్ ను సీజ్ చేసి, 8 మంది వ్యక్తులపై కేసు నమోదు చేసి కేసు దర్యాప్తు చేస్తున్నట్లు బోడు ఎస్సై శ్రీకాంత్ తెలిపారు.