calender_icon.png 7 August, 2025 | 4:25 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

8వ తేదీన సామూహిక వరలక్ష్మి వ్రతం..

06-08-2025 10:47:09 PM

సనాతన హిందూ ఉత్సవ సమితి నేతల వెల్లడి..

అదిలాబాద్ (విజయక్రాంతి): శ్రావణ మాసంలో ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం సైతం శ్రావణ శుక్రవారం రోజున సామూహిక వరలక్ష్మి వ్రతం నిర్వహించడం జరుగుతుందని సనాతన హిందూ ఉత్సవ సమితి ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షులు ప్రమోద్ కుమార్ ఖత్రి తెలిపారు. బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రిమ్స్ మహా గణపతి దేవాలయ ప్రధాన అర్చకులు ఓం ప్రకాష్ శర్మతో కలిసి ఆయన మాట్లాడుతూ.. శ్రావణ మాసంలో పౌర్ణిమకు ముందు వచ్చే శ్రావణ శుక్రవారం ఈనెల 8వ తేదీన స్థానిక శ్రీ రామచంద్ర గోపాల కృష్ణ మఠంలో సామూహిక వరలక్ష్మి వ్రతాన్ని నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఈ సామూహిక వరలక్ష్మి వ్రతంలో పాల్గొనే వారికి పూజా సామగ్రి ఉచితముగా ఇవ్వబడునని ఇంటి నుండి కేవలం కలశ చెంబు, హారతి పళ్ళెం మాత్రమే తీసుకొని రాగలరని సూచించారు. ఈ సమావేశంలో సనాతన హిందూ ఉత్సవ సమితి గౌరవ అధ్యక్షుడు బండారి వామన్, ఉపాధ్యక్షులు రేణుకుంట రవీందర్, సభ్యులు సంతోష్ అగర్వాల్, కందుల రవీందర్, మహిళా సభ్యులు పాల్గొన్నారు.