calender_icon.png 28 August, 2025 | 3:59 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పోలీసుల సేవలు భేష్‌

28-08-2025 01:49:58 PM

రెస్క్యూ ఆపరేషన్ చేసి 200 మందిని రక్షించిన పోలీసులు 

స్వయంగా రంగంలోకి దిగిన ఎస్పి, పట్టణ ఎస్ హెచ్ ఓ 

పోలీసుల సేవలను అభినందిస్తున్న కామారెడ్డి ప్రజలు 

కామారెడ్డి,(విజయక్రాంతి): ముంచెత్తిన నీటి వానలో ఎవరు వచ్చి ఆదుకుంటారో అని ఎదురుచూసిన ప్రజలకు పోలీసులు అండగా నిలిచారు. రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించి ప్రాణాలు అరిచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటున్న వారి కి కామారెడ్డి జిల్లా పోలీసులు అండగా నిలిచారు. గత రెండు రోజులుగా కురిసిన భారీ వర్షాలకు కామారెడ్డి జిల్లా కేంద్రంతో పాటు కళ్యాణి ప్రాజెక్ట్ పరివాహక ప్రాంతంలో ఉండి పనులు చేస్తున్న 8 మంది కూలీలు నీటి ప్రవాహంలో చిక్కుకొని ప్రాణాలను అరిచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కు మంటూ వాటర్ ట్యాంక్ పై ఏక్కి తమను ఎవరు కాపాడుతా రోనని ఎదురుచూసిన కార్మికులను జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర రేస్ క్యూ ఆపరేషన్ ఎన్ డి ఆర్ ఎస్ బలగాలతో నిర్వహించారు.

కళ్యాణి వాగు ప్రాజెక్టు వరద నీటిలో చిక్కుకొని సహాయం కోసం ఎదురుచూస్తున్న ఎనిమిది మంది కార్మికుల్లో మొదటిసారి ఐదుగురిని పోలీసులు ఒడ్డుకు చేర్చారు. మరో ముగ్గురిని బయటకు తీసుకువచ్చి వారి ప్రాణాలను కాపాడారు. దీంతో తమ ప్రాణాలు పోతాయని ఆవేదనతో ఉన్న తమకు అండగా నిలిచి ప్రాణాలు కాపాడిన పోలీసులను మర్చిపోలేని కార్మికులు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలిపారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని జి ఎస్ ఆర్ కాలనీలో బుధవారం వరద నీటిలో చిక్కుకుని తమను ఎవరు వచ్చి కాపాడతారని ఎదురుచూసిన వికలాంగులు, వృద్ధులు, మహిళలు, బిక్కు బిక్కు మంటూ వరద నీటిలో చిక్కుకొని ఎదురుచూసిన కాలనీవాసులకు జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర చూపిన రెస్క్యూ ఆపరేషన్ కు స్పిరిట్ పొందిన కామారెడ్డి పట్టణ సిఐ నరహరి పోలీస్ సిబ్బందితో వెళ్లి తాళ్ల  సహాయముతో జి ఎస్ ఆర్ కాలనీలో చిక్కుకున్న 150 మంది కాలనివాసులను వృద్ధులు, మహిళలు, వికలాంగులను తమ ఒంటిపై కూర్చుండబెట్టుకొని రెస్క్యూ తో బయటకు తీసుకువచ్చారు.

ఇదే కాలనీ పక్కన ఉన్న హౌసింగ్ బోర్డ్ లోని కౌండిన్య అపార్ట్మెంట్లో చిక్కుకున్న వారిని సైతం అదే స్పీడ్ గా పట్టణ సీఐ ఆధ్వర్యంలో మరో 50 మందిని బయటకు తీసుకువచ్చారు. ఎంతో ఆందోళనతో ఉన్న కాలనీవాసుల కు పోలీసులు భరోసా కల్పించి రాత్రి అయినా కూడా లేక చేయకుండా బుధవారం రాత్రి వారిని వారి ఇండ్ల నుంచి బయటకు తీసుకువచ్చి సురక్షితంగా కాపాడారు. దీంతో కాలనీ ల వాసులు పోలీసులు ధైర్యం చేసి తమను కాపాడడం పట్ల కృతజ్ఞతలు తెలిపారు. కామారెడ్డి పోలీసులు బేస్ అంటూ అభినందించారు. జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర స్పిరిట్ తోనే రెస్క్యూ ను తాము లెక్కచేయకుండా పోలీసుల అందరం కలిసి వరదనీటిలో చిక్కుకున్న వారందరినీ బయటకు తీసుకువచ్చి నట్లు పట్టణ సీఐ నరహరి విజయ క్రాంతి ప్రతినిధితో తెలిపారు. ప్రాణాపాయం నుంచి రక్షించడం పట్ల కామారెడ్డి ప్రజలు పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు.