calender_icon.png 28 August, 2025 | 4:11 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉన్నత విద్యను కొనసాగించే విధంగా చర్యలు తీసుకోవాలి

28-08-2025 01:47:20 PM

డెంగీ పరీక్షల సంఖ్య పెంచాలి 

యూరియా విక్రయాలను జాగ్రత్తగా పర్యవేక్షించాలి

జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి

గోపాల్ పేట: ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతి పూర్తి చేసి టీసీ తీసుకోని వారిని గుర్తించి వారి వివరాలు కనుక్కొని, వారు ఉన్నత విద్యను కొనసాగించే విధంగా చర్యలు తీసుకోవాలని వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. గురువారం కలెక్టర్ గోపాల్ పేట మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. గత ఏడాది పదో తరగతి ఫలితాలు రిపోర్టును పరిశీలించి, ఈ ఏడాది వెనుకబడిన విద్యార్థులకు మెరుగైన ఫలితాలు సాధించేందుకు ఏ విధమైన చర్యలు తీసుకుంటున్నారని అడిగి తెలుసుకున్నారు . కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పదో తరగతి విద్యార్థులు వంద శాతం పాస్ అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతి పూర్తి చేసి టీసీ తీసుకోని వారిని గుర్తించి వారి వివరాలు కనుక్కొని, వారు ఉన్నత విద్యను కొనసాగించే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. వెనకబడిన విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించి వారి సామర్థ్యాలను పెంపొందించాలని సూచించారు. గతేడాది కంటే ఈ విద్యా సంవత్సరం  ఉత్తమ ఫలితాలు సాధించాలని సూచించారు. ప్రధానంగా గణితం పై దృష్టి సారించాలని విద్యార్థులకు మెలకువలు నేర్పించాలని చెప్పారు. 

డెంగీ పరీక్షల సంఖ్య పెంచాలి

గోపాల్పేట మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేసి.. ఆస్పత్రిలో ఓ పి డి, ఈ డి డి రిజిస్టర్లను తనిఖీ చేశారు. నిత్యం ఆసుపత్రికి జ్వరంతో బాధపడుతూ ఎంతమంది వస్తున్నారని వివరాలను అడిగి తెలుసుకున్నారు. జ్వరంతో బాధపడుతూ ఆసుపత్రికి వచ్చే వారందరికీ డెంగ్యూ టెస్టులు తప్పకుండా చేయాలని ఆదేశించారు. రాట్ పరీక్షల సంఖ్య పెంచాలని సిబ్బందికి సూచించారు. డెంగీ పాజిటివ్ కేసు నమోదు అయిన వారి చికిత్స గురించి, వారి ప్రాంతాల్లో తీసుకుంటున్న చర్యల గురించి అడిగి తెలుసుకున్నారు. డెంగీ నమోదైన పరిసరాల్లో యాంటీ లార్వా కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. 

యూరియా విక్రయాలను జాగ్రత్తగా పర్యవేక్షించాలి

గోపాల్పేట మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార కేంద్రాన్ని కలెక్టర్ సందర్శించారు. యూరియా విక్రయాలను వ్యవసాయ అధికారులు జాగ్రత్తగా పర్యవేక్షించాలని సూచించారు. క్యూలైన్లో నిలబడిన రైతుల్లో ఇదివరకే 30 పైగా సంచులు తీసుకుని వెళ్లిన వారు ఎవరైనా ఉంటే తనిఖీ చేసి వారిని పంపించేసేయాలని సూచించారు. అదేవిధంగా, ప్రైవేటు డీలర్ల వద్ద ఉన్న స్టాక్ కు సంబంధించిన వివరాలను బోర్డులో పెట్టాలని సూచించారు. అందుకు సంబంధించిన బోర్డు అక్కడే ఉండడంతో దానిలో ప్రైవేటు డీలర్ల వద్ద యున్న యూరియా వివరాలను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ యూరియా కోసం వచ్చి అక్కడ నిలుచున్న రైతులతో మాట్లాడి వివరాలను తెలుసుకున్నారు.  జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి శ్రీనివాసులు, జిల్లా వ్యవసాయ అధికారి ఆంజనేయులు గౌడ్, తహసిల్దార్ పాండు నాయక్, మండల విద్యాధికారి, ఇతర అధికారులు తదితరులు కలెక్టర్ వెంట ఉన్నారు.