మల్కాజిగిరిలో ట్రిపుల్ రైడింగ్‌పై పోలీసుల ప్రత్యేక డ్రైవ్
682 కేసులు, రూ. 8.16 లక్షల జరిమానా
మేడ్చల్, జూన్ 18 (విజయక్రాంతి): రోడ్డు భద్రతలో భాగంగా, ట్రిపుల్ రైడింగ్, ప్రమాదకర డ్రైవి్ంప మల్కాజ్గిరి ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. కమిషనర్ ఆఫ్ పోలీస్ బి. సుమతి ఆదేశాల మేరకు, ట్రాఫిక్ జోన్లు I & II పరిధిలో ఈ తనిఖీలు నిర్వహించారు. డీసీపీల పర్యవేక్షణలో ఏసీపీలు, ఇన్స్పెక్టర్లు, ఎస్త్స్రలు, ట్రాఫిక్ సిబ్బంది పాల్గొన్నారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై 682 కేసులు నమోదు చేశారు.
మొత్తం రూ. 8,16,000 జరిమానా విధించారు. ప్రధాన కూడళ్లు, విద్యాసంస్థల పరిసరాలు, మార్కెట్ ప్రాంతాలు, రద్దీ ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టారు. ట్రిపుల్ రైడింగ్ వల్ల వాహనంపై నియంత్రణ తగ్గి, ప్రమాదాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుందని పోలీసులు తెలిపారు.
ఇది నడిపేవారికే కాకుండా ఇతర వాహనదారులకు కూడా ప్రమాదకరమని తెలిపారు. ద్విచక్ర వాహనదారులు నిర్దేశించిన సీటింగ్ సామర్థ్యం మేరకే ప్రయాణించాలని సూచించారు. బాధ్యతాయుతమైన డ్రైవింగ్ను ప్రోత్సహించేందుకు ఇలాంటి తనిఖీలు కొనసాగుతాయని మల్కాజ్గిరి ట్రాఫిక్ పోలీసులు స్పష్టం చేశారు.






