17 April, 2026 | 11:03 PM

Breaking News

బీసీ ముద్దుబిడ్డ విదేశాల్లో ఐటి గ్రాడ్యుయేషన్ పూర్తి   •   ఎండల తీవ్రతపై అప్రమత్తంగా ఉండాలి   •   ప్రభుత్వాసుపత్రుల్లో ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించాలి   •   శ్రీ సీతారామ చంద్ర, శ్రీ దుర్గ మల్లేశ్వర స్వాముల విగ్రహ ప్రతిష్ట.   •   అమావాస్య సందర్భంగా శ్రీ భగలాముఖి శక్తిపీఠంలో ప్రత్యేక పూజలు.!   •   రమేష్ గౌడ్‌పై పెట్టిన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసును వెంటనే రద్దు చేయాలి   •   అంధకారంలో వనదుర్గమ్మ భక్తులు   •   జాతీయస్థాయి బ్రోంజ్ డిస్క్ పురస్కారానికి ఎంపికైనా ఫైర్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు   •   గోల్డెన్ అవర్ లో సరైన చర్యలు తీసుకుంటే ప్రాణాలను రక్షించవచ్చు   •   ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థుల నిరసన   •  

కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనానికి యత్నం అడ్డుకున్న పోలీసులు

09-04-2025 01:40 AM

కరీంనగర్ క్రైమ్, ఏప్రిల్ 8 (విజయ క్రాంతి):  అంతర్జాతీయ స్థాయిలో క్రూడా యిల్ ధరలు తగ్గినప్పటికీ దేశంలో బిజెపి ప్రభుత్వం పేద మధ్యతరగతి సామాన్య ప్రజలపై భారం మోపడానికి వంటగ్యాస్ ధరలు పెంచడం దుర్మార్గమని పేదలపై భారం మోపే దేశ ప్రధాని మోడీకి మూడిన ట్లేనని సిపిఐ జిల్లా కార్యదర్శి మర్రి వెంకట స్వామి అన్నారు.

మంగళవారం కరీంనగర్ లోని కమాన్ చౌరస్తా వద్ద సిపిఐ ఆధ్వ ర్యంలో పెంచిన వంట గ్యాస్ ధరలు తగ్గిం చాలని కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధం చేయడానికి ప్రయత్నించిన సిపిఐ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. కొద్దిసేపు పోలీసులకు, సీపీఐ నేతలకు తోపులాట జరగగా సీపీఐ జిల్లా కౌన్సిల్ సభ్యులు పైడిపల్లి రాజు తలకు గాయమై రక్తస్రావం అయ్యింది.కొంతమంది కిందపడగా వారికి దెబ్బలు తగిలాయి.

ఆందోళన చేస్తున్నంత సేపు వాహనాలు నిలిచిపోయాయి. ఈ సందర్భంగా సీపీఐ జిల్లా కార్యదర్శి మర్రి వెంకటస్వామి మాట్లాడుతూ బిజెపి ప్రభుత్వం పదకొండు సంవత్సరాలలో పేద, మధ్య తరగతి, సామాన్య ప్రజలపై పెను భారం మోపడా నికి  అనేకసార్లు పెట్రోలు, డీజీలు, వంటగ్యాస్, నిత్యవసర వస్తువుల ధరలు విపరీతంగా పెంచి పేదల జీవన ప్రమాణాల ను దెబ్బతీసే విధంగా మోడీ పాలన కొనసాగుతుందని అన్నారు. 

సీపీఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు పొనగంటి కేదారి, జిల్లా కార్యవర్గ సభ్యులు కొయ్యడ సృజన్ కుమార్,నగర కార్యదర్శి కసిరెడ్డి సురేందర్ రెడ్డి,జిల్లా కౌన్సిల్ సభ్యులు కసిరెడ్డి మణికంఠ రెడ్డి,పైడిపల్లి రాజు,కిన్నెర మల్లవ్వ,సాయవేణి రాయమల్లు, బ్రామండ్ల పెల్లి యుగంధర్, న్యాలపట్ల రాజు,బోనగిరి మహేందర్, మచ్చ రమేష్, నాయకులు కొట్టే అంజలి, చెంచల మురళి, తంగెళ్ళ సంపత్, చారి, రాజు, కూన రవి, నల్లగొండ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు