calender_icon.png 25 January, 2026 | 6:13 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మహమ్మద్ నగర్ లో పోలీసుల పహారా..

23-10-2024 11:32:40 AM

ఉమ్మడి మండలాల్లో ప్రశాంతంగా కొనసాగుతున్న బంద్

నిజాంసాగర్: కామారెడ్డి జిల్లాలోని నిజాంసాగర్ మహమ్మద్ నగర్ మండలాల్లో బంద్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఆలయాలపై దాడులను నిరసిస్తూ హిందూ సంఘాలు బుధవారం నిజాంసాగర్ మహమ్మద్ నగర్ ఉమ్మడి మండలాలు బందుకు పిలుపునిచ్చాయి. దుకాణ సముదాయాలు, ప్రైవేట్ పాఠశాలలు, పెట్రోలు బంకు యజమానులు బంద్ సంపూర్ణంగా పాటించారు. ఎలాంటి అల్లర్లు జరగకుండా ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా పోలీసులు ప్రత్యేక బలగాలతో పహారా కాస్తున్నారు. నిజాంసాగర్, మహమ్మద్ నగర్ మండల కేంద్రంలో నిజాంసాగర్ ఎస్ఐ సుధాకర్, బీర్కూర్ ఎస్సై రాజశేఖర్, నసుర్లబాద్ ఏఎస్ఐ వెంకట్రావుతో పాటు ప్రత్యేక పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు.