ఈ సమస్యలను పట్టించుకునేది ఎవరు
మహా ముత్తారం, ఆగస్టు 05 (విజయక్రాంతి): జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహా ముత్తారం మండలం వజిన పల్లి, గ్రామ సమస్యలకు పరిష్కారం చూపమంటే ఊరిలో రాజకీయం చేస్తున్నారని చెప్పినా పట్టించుకోకుండా పెడదారిని పెడుతూ మౌనంగా ఉంటున్నారని సంబంధిత బాధితులు ఆరోపిస్తున్నారు.
బుధవారం మండలంలోని వజినేపల్లి గ్రామపంచాయతీ పరిధిలో ఆర్ అండ్ బి రోడ్డుకు గ్రామ శివారులో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు మాజీ వార్డ్ మెంబర్ జక్కుల లక్ష్మి పొలం నీటిలో మునిగి నష్టం వాటిల్లిందని రోడ్డుపై నుంచి నీరు ప్రవహించిన పట్టించు కునే వారు లేరని ఆరోపిస్తున్నారు.
గతంలో వర్షపు నీటితో ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండేదని కింది వైపు కొత్తగా ఇల్లు నిర్మించి లబ్ధిదారుడు ఆ నీరు పోకుండా మట్టి పోసి పూడ్చాడని ముందు చెప్పగా సరే అని రాత్రికి రాత్రి మట్టితో పూడ్చాడని జక్కుల లక్ష్మి ఆరోపిస్తున్నారు. వర్షాల వల్ల నా ఇల్లుకు నీళ్లు తగిలి పొలంతో పాటు నా ఇల్లు కూలి ప్రమాదం ఉందని సంబంధిత అధికారులు స్పందించి న్యాయం చేయాలని ఆమె విజ్ఞప్తి చేశారు. వికలాంగురాలైన నన్ను ఎవరు పట్టించుకుంటలేరని కన్నీరు మున్నీరుగా విలపించారు. మండల అభివృద్ధి అధికారి వెంటనే స్పందించి న్యాయం చేయాలని కోరారు.






