calender_icon.png 26 October, 2025 | 3:02 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పోలియో నిర్మూలన ప్రతి ఒక్కరి లక్ష్యం కావాలి

25-10-2025 12:51:57 AM

భద్రాచలం శాసనసభ్యులు తెల్లం వెంకటరావు

భద్రాచలం, అక్టోబర్ 24, (విజయక్రాంతి)ప్రపంచ పోలియో నిర్మూలన దినోత్సవం సందర్భంగా రోటరీ క్లబ్ ఆఫ్ రివర్ సైడ్ భద్రాచలం, ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఎన్‌ఎస్‌ఎస్ విద్యార్థులు శుక్రవారం భారీ ర్యాలీ నిర్వహించారు.ఈ ర్యాలీని జెండా ఊపి ప్రారంభించిన భద్రాచలం శాసనసభ్యులు తల వెంకట్రావు సందర్భంగా ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఎన్‌ఎస్‌ఎస్ విద్యార్థిని విద్యార్థినిలు, రోటరీ క్లబ్ సభ్యులను ఉద్దేశించి ప్రసంగించారు.

పోలియో నిర్మూలన ప్రతి ఒక్కరి లక్ష్యం కావాలనీ, ప్రపంచ రోటరీ సంస్థ ప్రపంచంలో పోలియోని నిర్మూలించడానికి ఎంతో కృషి చేస్తుందనీ, ప్రపంచం మొత్తానికి పోలియో వ్యాక్సిన్ ప్రపంచ రోటరీ సంస్థ సరఫరా చేస్తుందనీ, ప్రభుత్వాలు రోటరీ వంటి స్వచ్ఛంద సంస్థలు ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకు వెళ్తూ ప్రభుత్వ వైద్య ఉద్యోగులు ప్రతి ఇంటిలో సంవత్సరానికి రెండుసార్లు పోలియో చుక్కల మందులు వేసి భారతదేశాన్ని పోలియో రహిత దేశంగా చేశారని,

భవిష్యత్తులో పోలియో రాకుండా నివారించేందుకు ఈ అవగాహన ర్యాలీలను దేశవ్యాప్తంగా రోటరీ సంస్థ నిర్వహిస్తుందని కాబట్టి భద్రాచలంలో కూడా పోలియో చుక్కలు ప్రతి ఒక్కరికి అదే విధంగా చూడాల్సిన బాధ్యత వైద్య ఆరోగ్య సిబ్బందిపై ఉందని, ప్రచారం చేయాల్సిన బాధ్యత స్వచ్ఛంద సంస్థలపై ఉందని అన్నారు.

ర్యాలీలో పాల్గొన్న సమూహాన్ని ఉద్దేశించి ప్రస్తుత భద్రాచలం రివర్ సైడ్ రోటరీ క్లబ్ అధ్యక్షులు మరియు రెండు తెలుగు రాష్ట్రాల రోటరీ ఇంటర్నేషనల్ మాజీ గవర్నర్ డా.బూసిరెడ్డి శంకర్ రెడ్డి ప్రసంగిస్తూ, పోలియో చుక్కలు వేయించడంపై ప్రజల్లో అవగాహన తేవాల్సిన బాధ్యత ముఖ్యంగా యువతకు ఉందని, భవిష్యత్తులో ఒక్క పోలియో కేసు కూడా రాకుండా నివారించాలని, తద్వారా పోలియోని ఈ ప్రపంచం నుండి నిర్మూలించాలని పిలుపునిచ్చారు.

కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థిని విద్యార్థుల సమూహాన్ని ఉద్దేశించి ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ కే జాన్ మిల్టన్ ప్రసంగిస్తూ, సేవా కార్యక్రమాల్లో తామెప్పుడూ ముందుంటామని తమ కళాశాల ఎన్‌ఎస్‌ఎస్ విద్యార్థులు విద్యార్థులు చాలా కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారని భవిష్యత్తులో రోటరీతో కలిసి సమాజ సేవా కార్యక్రమాల్లో విస్తృతంగా పాల్గొంటామని పేర్కొన్నారు.

సుమారు 500 మంది పాల్గొన్న ఈ అవగాహన ర్యాలీ నందు రోటరీ క్లబ్ పూర్వ అధ్యక్షుడు డాక్టర్ రమేష్ బాబు , రోటరీ క్లబ్ ఉపాధ్యక్షులు ధనకొండ రాఘవయ్య, గంజి సంపత్, కళాశాల ప్రణాళిక, అభివృద్ధి కమిటీ సభ్యులు కొడాలి శ్రీనివాసు, బుడగం శ్రీనివాసరావు, తుమ్మలపల్లి ధనేశ్వరరావు, ప్రముఖ క్రీడాకారుడు దాట్ల శ్రీనివాసరాజు లతోపాటు ఎన్ ఎస్ ఎస్ అధికారి కిరణ్ కుమార్, అకాడమిక్ కోర్డినేటర్ శ్రీమతి హిమజ, కంట్రోలర్ అఫ్ ఎగ్జామినేషన్ శ్రీను, అధ్యాపకులు నాగసమీరా, రాఘసుమ రోటరీ క్లబ్ ఆఫ్ రివర్ సైడ్ క్లబ్ సభ్యులు అనేకమంది స్వచ్ఛంద సంస్థల నాయకులు సంఘ సేవకులు పాల్గొన్నారు.