25-10-2025 12:51:11 AM
ఎమ్మెల్యే మదన్మోహన్
ఎల్లారెడ్డి, అక్టోబర్ 24 (విజయ కాంతి) : కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గంలో మత్తమాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని వెలుట్ల, అన్నాసాగర్ గ్రామాలలో ఆరోగ్య ఉప కేంద్రాల భవనాలను శుక్రవారం ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్, జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి చంద్రశేఖర్ తో కలిసి ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే మదన్ మోహన్ వైద్య ఆరోగ్యశాఖ సిబ్బందితో మాట్లాడుతూ ప్రజలకు వైద్యం పట్ల ఆటంకం కలుగకుండా సేవలందించాలని వైద్యులు దేవుళ్ళతో సమానమని అన్నారు.
ఆ ఒక్కొక్క ఆరోగ్య ఉప కేంద్రానికి 20 లక్షల రూపాయలతో భవనం నిర్మాణం పూర్తయిందని ప్రజా ప్రభుత్వంలో ప్రజలకు ఎటువంటి ఆటంకం తలెత్తకుండా వైద్య సేవలు అందించడానికి వైద్యారోగ్య శాఖ సిబ్బంది ఎప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉండి ఆశ, వర్కర్ నుండి మొదలుకొని, ప్రజా ప్రభుత్వంలో నియామకమైన పల్లె దావకాణ సిబ్బంది ఎం.ఎల్.యాచ్.పి, వైద్య ఆరోగ్య కార్యకర్త, వైద్యాధికారి ప్రజలకు వైద్యం అందించడంలో నిర్లక్ష్యం వహించరాదని పల్లె దావఖానలో ఉదయం నుండి సాయంత్రం వరకు విధుల్లో నిర్లక్ష్యం వహించిన సిబ్బందికి కఠిన చర్యలు తప్పవని ఎమ్మెల్యే మదన్మోహన్ నిర్మోహమాటంగా వైద్యారోగ్య శాఖ సిబ్బందికి హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డిఎంహెచ్వో డాక్టర్ చంద్రశేఖర్, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి, పద్మజ, మతమాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యులు శరత్ కుమార్, మతమాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిబ్బంది, సి హెచ్ ఓ, ఠాకూర్ హెచ్‌ఈఓ గోవింద్ రెడ్డి జనార్దన్ రెడ్డి, సూపర్వైజర్లు రాజేశ్వరి, బి ఏ ఎం ఎస్ వైద్యులు అజ్మతుల్లా, ఆరోగ్య కార్యకర్త, ఇందిరా, వసంత, వైద్యానికి శాఖ సిబ్బంది, ఎల్లారెడ్డి మాజీ మున్సిపల్ చైర్మన్ కుడుముల సత్యనారాయణ, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రజిత వెంకట్రాంరెడ్డి, తిమ్మారెడ్డి మాజీ సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి, వెల్లుట్ల మాజీ సర్పంచ్ గంటా సాయిలు, బిసి సంఘం జిల్లా నాయకులు చింతల శంకర్, ఎల్లారెడ్డి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కురుమ సాయిబాబా, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు, వినోద్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.