calender_icon.png 26 October, 2025 | 12:46 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వర్తక సంఘానికి ఎలక్షన్ల హడావుడి!

25-10-2025 12:54:33 AM

  1. ముఖ్య ఎన్నికలను తలపిస్తున్న వైనం 

ప్రధాన ఛాంబర్‌తో పాటు 18 శాఖల అసోసియేషన్లకు ఎన్నికలు

రెండు ప్యానెళ్ళుగా బరిలోకి దిగబోతున్న అభ్యర్థులు 

ఖమ్మం, అక్టోబర్ 24 (విజయ క్రాంతి): ఖమ్మం పట్టణంలోని వర్తక సంఘంలో ఎన్నికల హడావిడి మొదలైంది. ప్రధాన ఛాంబర్ తో పాటు వర్తక సంఘానికి అనుబంధంగా ఉన్న దిగుమతి శాఖ, బులియన్ అసోసియేషన్, క్లాత్ మర్చంట్ అసోసియేషన్ వంటి 18 శాఖలకు ఎన్నికలు జరగనున్నాయి. వచ్చే నెల 16వ తేదీన ఎన్నికల నిర్వహణ, అదే రో జు ఫలితాలు విడుదల కానున్నాయి. వీటికి సంబంధించి ఈ నెల 27వ తేదీ నుంచి నా మినేషన్ల ప్రక్రియ మొదలుకానుంది. ఆయా అసోసియేషన్లకు సంబంధించిన వ్యక్తులు రెండు ప్యానేళ్లుగా విడిపోయి బరిలోకి దిగుతున్నారు.

ఈ ఎన్నికల్లో ఏ ప్యానల్ విజ యం సాధిస్తుందోనని కొంతమంది వ్యాపారస్తులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరి కొంతమంది వ్యాపారస్తులు మాత్రం ఇది పూర్తిగా ప్రైవేట్ వ్యక్తుల వ్యవహారమని, తమ వ్యాపారానికి ఎలాంటి ఇబ్బందులు లేకుం డా చూసుకునేందుకు, రాజకీయ పలుకుబడి పెంచుకునేందుకు మాత్రమే ఈ ఎన్నిక ల తంతు అని పెదవి విరుస్తున్నారు. 

గతంలో ఏకగ్రీవాలే..

ప్రస్తుతం వర్తక సంఘానికి ఎన్నికలు అనగానే ఎక్కడలేని హడావుడి కనిపిస్తోంది. ప్ర ధాన ఎన్నికలను తలపించేలా ఆయా ప్యానె ల్ అభ్యర్థులు ప్రచారం నిర్వహిస్తున్నారు. అ యితే ఓ రెండు మూడు దశాబ్దాల కిందటి వరకు సంఘానికి ఎన్నికలు అనేవి లేకుండా దాదాపుగా అన్ని పదవులకు నాయకులను ఏకగ్రీవంగా ఎన్నుకునే సంప్రదాయం ఉండేదని నిన్నటి తరం వ్యాపారస్తులు చెబు తున్నారు.

ప్రస్తుతం మారిన పరిస్థితుల దృ ష్ట్యా ప్రధాన ప్యానెల్ అధ్యక్ష, సెక్రటరీ పదవులకు, అనుబంధ శాఖ అయిన దిగుమతి శాఖ అధ్యక్ష పదవులకు ప్రాధాన్యం ఎక్కువైంది. ఈ పదవుల్లో ఉన్నవారికి అటు వ్యా పార వర్గాల్లోనూ, ఇటు రాజకీయ వర్గాల్లో నూ కాస్త పరపతి పెరిగింది. ఇక గతంలో మాదిరిగా కాకుండా, ఆయా వ్యాపారాల్లో వ్యాపారస్తుల సంఖ్య పెరిగిపోవటంతో పా టు, సంఘంలోని ముఖ్య శాఖలోని ప్రధాన పదవులను ఆశించే వారి సంఖ్య పెరిగిపోయింది.

దీంతో ఎన్నికలు తప్పనిసరి అయ్యా యి. ఇక్కడి వరకు బాగానే ఉన్నా, ప్రాతిని ధ్యం కోరుకునే కొంతమంది వర్తక సంఘంలోని తమ పదవులను సొంత ప్రయోజనా ల కోసం వాడుకుంటున్నారన్న విమర్శలు వి నిపిస్తున్నాయి. సంబంధిత సంఘంలో పదవులు అనుభవిస్తున్న కొంతమంది ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి వత్తాసు పలుకుతూ, తమ పబ్బం గడుపుకోవడాన్ని వ్యా పార వర్గాల్లోని వారు ఉదాహరణగా చూపిస్తుండడంతో పై వాదనకు బలం చేకూరుతోంది. 

వీటికి కూడా బెదిరింపు లేనా..?

వర్తక సంఘం స్వయం ప్రతిపత్తి కలిగిన వ్యవస్థ అయినా ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరుగుతాయి. సంఘం కింద ఆయా శాఖలకు చెందిన దాదాపు 1305 మందికి సభ్యత్వం ఉంది. వీరంతా ఎన్నికల్లో నిలబడిన అభ్యర్థులకు ఓట్లను వేసి తమ నా యకులుగా ఎన్నుకుంటారు. అయితే ఛాంబ ర్ లోని కొంతమంది వ్యక్తులు మాత్రం తమ ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారన్న విమర్శలు తీవ్రంగా వినిపిస్తున్నాయి.

తమకు వ్యతిరేకంగా లేదా తమ మాట వినని సభ్యులను ఛాంబర్ నుంచి గతంలో బహిష్కరించినట్లు తెలుస్తోంది. అసలు ఛాంబర్ నాయకులు బై లా నియమాలను పాటించకుండా, నియం త పోకడలను అనుసరించి, తమను బహిష్కరించారని వాదిస్తూ బహిష్కరణకు గురైన సభ్యులు కోర్టుకెక్కారు. ప్రస్తుతం ఈ కేసు కోర్టులో నడుస్తోందని సమాచారం. ఇక మ రి కొంతమంది నాయకులు ఛాంబర్ పదవులతో పాటు, గత అధికార పార్టీ నాయకుల అండదండలతో తమ వారికి అర్హత లేకపోయినా కమీషన్ మర్చంట్ లైసెన్సులు ఇ ప్పించినట్లు తెలుస్తోంది.

కమీషన్ మర్చంట్ లైసెన్సులకు చాంబర్ కు అసలు సంబంధం లేదు. భవిష్యత్తులో తమకు ఉపయోగపడతారని, ముఖ్యంగా వర్తక సంఘం ఎన్నికల సమయంలో తమకు మద్దతు తెలుపుతారననే ఉద్దేశంతో కమీషన్ మర్చంట్ లైసెన్స్ వచ్చేలా చేయగలిగారన్న విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. ఇదంతా ఒక ఎత్తయితే ఛాంబర్ లోని ఆయా పదవులకు పోటీపడే వాళ్లకు తమకే అధికారం దక్కాలని తప్పుడు మార్గాలను అనుసరిస్తున్నట్లు, ఒకరిద్దరు వ్యక్తులు మరో అడుగు ముందుకు వేసి బెదిరింపులకు కూడా దిగుతున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి.

ఓ శాఖ నుంచి ఛాంబర్ ముఖ్య పదవికి పోటీ పడబోతున్న వ్యక్తి ఇలా వ్యవహరించినట్లు తెలుస్తోంది. సదరు వ్యక్తికి గత ప్రభుత్వంలోని ముఖ్య నాయకులతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. వీటిని అడ్డం పెట్టుకొని ప్రస్తుతం తనకు పోటీగా దిగబోతున్న సాటి వ్యాపారిని పోటీకి దిగవద్దని, ఒకవేళ తన మాట కాదని బరిలోకి దిగితే వ్యాపారం ఎలా చేస్తావో చూస్తానంటూ బెదిరించినట్లు తెలుస్తోంది.

దీనిని బట్టి వర్తక సంఘం పదవులను అనుభవించేవారు ఆయా వర్గాలకు మేలు చేకూ ర్చేందుకు కాకుండా, తమ స్వార్థం కోసం ఉపయోగించుకుంటున్నారని, ఇందుకు పై ఉదాహరణలు సాక్ష్యంగా నిలుస్తున్నాయన్న అభిప్రాయం వ్యక్తం అవుతుంది. 

ఆదాయం మాటేమిటి..?

వర్తక సంఘం పాలకవర్గం పదవీకాలం మూడేళ్లు. ఇక ఇందులోని సభ్యుల సంఖ్య 1305. వీరంతా ప్రతి ఏడాది సభ్యత్వ రుసుము కింద కొంత మొత్తం చెల్లించాల్సి ఉంటుంది. దీని వల్ల ప్రతి ఏడాది లక్షల రూ పాయల ఆదాయం వస్తోంది. దీనికి అదనంగా వర్తక సంఘం భవనం, ఆయా శాఖల పరిధిలోని భవనాల నుంచి వివిధ రూపా ల్లో ఆదాయం సమకూరుతోంది. ఇలా వచ్చే ఆదాయం మూడేళ్లలో అరకోటి నుంచి కోటి వరకు ఉంటుందని అంచనా! ఈ స్థాయిలో ఆదాయం వస్తున్న ఆయా భవనాల నిర్వహణ సరిగా లేదని సంఘంలోని కొంత మంది వ్యక్తులే బాహాటంగా విమర్శలు గు ప్పిస్తున్నారు.

ఇక వర్తక సంఘం పెద్దగా సహాయక కార్యక్రమాల్లో పాల్గొన్నది లేదని, మొన్నటి వరదలకు తప్పించి అంతకుముందు ఏ సహాయక కార్యక్రమాలు చేపట్టి న ఘటనలు లేవని వ్యాపార వర్గాల్లోని మరి కొంతమంది గుర్తు చేసుకుంటున్నారు. మరి వచ్చే ఆదాయం మొత్తాన్ని ఏం చేస్తున్నారని? వేటికి ఖర్చు చేస్తున్నారని? ప్రశ్నలు వినిపిస్తున్నాయి.

సంఘానికి వచ్చే ఆదా యం, అయ్యే ఖర్చుల గురించి ఎవరూ అడగరు కాబట్టి వాటి గురించిన వివరాలు బయటకు వచ్చే అవకాశం లేదు. అడిగేవాళ్లు లేరు కాబట్టే సంఘంలోని ముఖ్యులు ఏది చెబితే అదే నిజమనే భావన ఉంది. దీంతో జమా ఖర్చుల విషయం ఎవరికీ పట్టని అం శంగా మిగిలిపోయిందనే అభిప్రాయం వినిపిస్తోంది. వీటి గురించి పట్టించుకునే నాధు డు ఎవరూ లేరని, అదొక చిదంబర రహస్యమేనన్న ఆవేదన కూడా వినిపిస్తోంది. 

నాయకులు దృష్టి సారిస్తే..

వర్తక సంఘం కేవలం వ్యాపారస్తులకు సంబంధించిన వ్యవహారం మాత్రమే! అలా అని కనీస అజమాయిషి లేకపోతే అసలు లోపల ఏం జరుగుతోంది? ఎవరికి ఇబ్బంది కలుగుతుంది? అనే విషయాలు బయటకు పొక్కవు. పోనీ వర్తక సంఘం తరఫున నా యకులు సంబంధిత పదవులను కేవలం వ్యాపారానికే పరిమితం చేస్తున్నారా? అంటే అదీ లేదు.

అవసరమైన సందర్భాల్లో తమ పదవులను ఉపయోగించి నాయకుల ప్రాప కం పొందుతున్నారు. దీనిని దృష్టిలో పెట్టుకొని జిల్లాలోని ముఖ్య నాయకులు సంఘం విషయాల్లో నేరుగా కలగజేసుకోకపోయినా, స్వయం ప్రతిపత్తి గల సంఘాన్ని అభాసపాలు చేయకుండా వ్యవహరించేలా సరైన మార్గం నిర్దేశం చేయాలని వ్యాపార వర్గాలు కోరుతున్నాయి.