పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ సమావేశం
- పాల్గొన్న ఎమ్మెల్యే శ్రీగణేష్, మంత్రులు తదితరులు
- సర్‌పై చర్చించిన ఏఐసీసీ రాష్ట్ర ఇన్‌చార్జి మీనాక్షినటరాజన్
సికింద్రాబాద్, ఆగస్టు 18(విజయక్రాంతి): గాంధీ భవన్‌లో ఏఐసీసీ తెలంగాణ ఇంఛార్జ్ మీనాక్షీ నటరాజన్ అధ్యక్షతన మంగళవారం నిర్వహించిన సికింద్రాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ సమావేశంలో కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ మంత్రులు పొన్నం ప్రభాకర్, మొహమ్మద్ అజహరుద్దీన్, ఎంపీ అనీల్ కుమార్ యాదవ్, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దీపక్ జాన్‌తో కలిసి పాల్గొన్నారు.
ఈ సమావేశంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) పై విస్తృతమైన చర్చ చేశారు. అర్హులైన ప్రతి ఒక్కరి ఓటూ ఓటర్ లిస్టులో ఉండేలా బీఎల్‌ఏలు, బీఎల్‌వోలతో సమన్వయం చేసుకోవాలని, ప్రతి ఇంటికి వెళ్లి వారి ఓటు లిస్టులో ఉందో లేదో చూడాలని చర్చించారు.అలాగే జిల్లాలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి చర్యలు తీసుకోవాలని, ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకు వెళ్లాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ సమావేశంలో జిల్లాలోని కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు పాల్గొన్నారు






